Begin typing your search above and press return to search.
`తలైవి`కి కష్టాలు.. అసలైన ఆయన మిస్సింగ్!!
By: Tupaki Desk | 12 July 2020 6:30 AM GMTక్వీన్ కంగన రనౌత్ టైటిల్ పాత్రలో `తలైవి` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమ్మ జయలలిత బయోపిక్ ఇది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంగనపై లుక్ టెస్టులు మొదలు ఫస్ట్ లుక్ వచ్చేవరకూ వరుస ఎపిసోడ్స్ తెలిసిందే. కంగన ఈ చిత్రంలో నాలుగు గెటప్పుల్లో కనిపించనుంది. అందులో జయలలిత బాల్యం నాటి లుక్ లో వేరొకరు కనిపిస్తారు. ఆ తర్వాత జయలలిత కథానాయికగా ప్రయత్నించేప్పటి లుక్ .. నాయకురాలు అయినప్పటి లుక్.. 60 ప్లస్ ఏజ్ లో లుక్ .. మిడిలేజీలో లుక్ ఇలా నాలుగు రకాలుగా కనిపిస్తుందట.
హాలీవుడ్ మూవీ `డార్కెస్ట్ హవర్` ఫేం గ్యారీ ఓల్డ్ మెన్ జయలలిత నాయకురాలిగా ఉన్నప్పటి లుక్ ని డిజైన్ చేశారు. అయితే ఆయన మేకప్ మిస్ ఫైరైంది. మోషన్ పోస్టర్ వచ్చాక.. అందులో అమ్మ లుక్ బాలేదంటూ విమర్శలొచ్చాయి. అయితే జయలలిత కథానాయికగా ఉన్నప్పటి లుక్ లీకైతే ఆ ఫోటోకి అద్భుత స్పందన వచ్చింది.
ప్రస్తుతం నాయకురాలైన జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల్ని .. అమ్మ చివరి రోజులకు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉందిట. అంటే ఇప్పుడు మరోసారి గ్యారీ ఓల్డ్ మన్ తిరిగి ఇక్కడ అడుగు పెట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత మహమ్మారీ క్రైసిస్ వల్ల ఆయన రావడం కుదరడం లేదుట. దీంతో వేరొక మేకప్ మేన్ ని సంప్రదించే యోచనలో ఉన్నారని తెలిసింది.
అమ్మ జీవితంలో 18 ఏళ్ల ఏజ్ నుంచి 60 వరకూ ఏం జరిగింది? అన్నది తెరపై చూపించనున్నారు. అంటే రకరకాల గెటప్పుల్ని చూపించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రోస్థటిక్స్ తెలిసిన మేకప్ మేన్ టీమ్ ని దించాల్సి ఉంటుంది. ఆ మేరకు విష్ణు ఇందూరి టీమ్ చాలా రిస్కులు చేయాల్సి ఉంటుందన్నమాట. మహమ్మారీ తెచ్చిన కొత్త చిక్కు ఇది.