Begin typing your search above and press return to search.

అంతా డిజిటల్ మయం

By:  Tupaki Desk   |   4 Aug 2018 2:30 PM GMT
అంతా డిజిటల్ మయం
X
ఒకప్పుడు సినిమా నిర్మాతకు ఆదాయ వనరు థియేట్రికల్ రైట్స్ మాత్రమే. అందులో ఎంత వస్తే అదే లాభం. రాలేదో అదే నష్టం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఎంటర్ టైన్మెంట్ కొత్త పుంతలు తొక్కుతోంది. శాటిలైట్ ఛానల్స్ మధ్య పోటీ నిర్మాతలకు వరంగా మారింది. సినిమా బడ్జెట్ లో సగానికి పైగా హక్కుల రూపంలో రాబట్టుకునే వెసులుబాటు రావడంతో కాస్త ఖర్చు ఎక్కువైనా ముందు వెనుకా ఆలోచించడం లేదు. ఏ ట్రెండ్ ఎల్లకాలం ఉండదు కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా మార్పులు వస్తున్నాయి.

యు ట్యూబ్ ఒక విప్లవం అనుకుంటే అంతకు మించి అనే స్థాయిలో ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దానికి తోడు నార్త్ లో తెలుగు డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఎంత డబ్బు పోసైనా సరే రైట్స్ కొనేందుకు వెనుకాడటం లేదు. గోల్డ్ మైన్స్ అనే యు ట్యూబ్ ఛానల్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగుల తోనే కోట్ల ఆదాయాన్ని టార్గెట్ చేసుకుంది. అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు వచ్చాక వీటి ఉదృతి ఇంకా పెరిగింది. ఈ ఏడాది వచ్చిన మూడు టాప్ బ్లాక్ బస్టర్స్ రంగస్థలం-భరత్ అనే నేను-మహానటి మూడు అమెజాన్ ద్వారా అవి రిలీజైన రెండు నెలల లోపే అమజాన్ ప్రైమ్ ద్వారా విడుదలయ్యాయి. వీటికి ఆదరణ భారీగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటిదాకా ఈ మూడింటిలో ఏదీ శాటిలైట్ ఛానల్ లో ఇప్పటిదాకా రాలేదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకే నిర్మాతలు సైతం తమకు తక్షణ ఆదాయ వనరుగా మారిన డిజిటల్ హక్కుల వైపే మొగ్గు చూపుతున్నారు.

యూట్యూబ్ కు సమాంతరంగా పోటీ ఇస్తున్న ఆన్ లైన్ యాప్స్ లో అమెజాన్ నెట్ ఫ్లిక్స్ తో పాటు జీ-సన్ నెట్వర్క్ లాంటి సంస్థలు కూడా వీడియో యాప్స్ లాంచ్ చేశాయి. మొత్తానికి బుల్లితెర డెఫినేషన్ కాస్తా టీవీ నుంచి స్మార్ట్ ఫోన్ కి మారిపోయేలా ఉంది. యాడ్స్ ని భరిస్తూ గంటల కొద్దీ టీవీల ముందు కూర్చోవడం కంటే ఆరంగుళాల స్మార్ట్ ఫోన్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని హెచ్ డి క్లారిటీ తో సినిమాలు ఎంజాయ్ చేయడానికే యూత్ ఇష్టపడుతోందని సర్వే ద్వారా తేలింది. ముందు ముందు ఇంకెలాంటి మార్పులు రానున్నాయో ఊహకు అందటం లేదు.