Begin typing your search above and press return to search.

దేవుడు నడిపే క్రైమ్ థ్రిల్లర్ - ట్రైలర్ టాక్

By:  Tupaki Desk   |   10 March 2019 9:10 AM GMT
దేవుడు నడిపే క్రైమ్ థ్రిల్లర్ - ట్రైలర్ టాక్
X
ఇప్పటిదాకా క్రైమ్ సినిమాలు చూసాం. థ్రిల్లర్ మూవీస్ ఎంజాయ్ చేసాం. డివోషనల్ అంటూ ప్రత్యేకంగా భక్తి క్యాటగిరీలో ఇంకొన్ని చూసి తరించాం. కానీ ఈ మూడు జానర్లను మిక్స్ చేసి ఏదో వెరైటీగా చెప్పే ప్రయత్నం చేసింది దిక్సూచి టీమ్. బాలనటుడిగా 30 పైగా సినిమాల్లో నటించి హీరోగా పలు చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్ సల్వాడి నటించి దర్శకత్వం వహించిన దిక్సూచి. దీని ట్రైలర్ ని ఇందాకా విడుదల చేశారు.

హీరో ఓ టీవీ రిపోర్టర్. గుళ్లో హీరోయిన్ ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. వీళ్లిద్దరికీ అదే ఊళ్ళో ఉన్న శివాలయానికి ఓ లింక్ ఉంటుంది. కట్ చేస్తే కథ 1975కు షిఫ్ట్ అవుతుంది. అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలకు గుళ్లో శివలింగానికి తర్వాత జరిగిన దారుణాలుకు సంబంధం ఉంటుంది. అది చేధించే బాధ్యత హీరో మీద పడుతుంది. అనూహ్యమైన సంఘటనలు ఎన్నో జరుగుతాయి. చివరికి ఆ లింగాన్ని కౌగిలించుకున్న ఆస్థిపంజరం దగ్గరికి అందరు చేరుతారు. ఇదంతా ఏంటి అని తెలుసుకోవడమే దిక్సూచి

ఏది కొత్త ప్రయత్నమే చేసినట్టు కనిపిస్తోంది. మేకింగ్ కాస్త రిచ్ గానే ఉంది. ఒకరిద్దరు తప్పించి అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ లో కాంప్రమైజ్ కనిపిస్తున్నప్పటికీ ఇంటెన్సిటీ మైంటైన్ చేయడానికి దర్శకుడు దిలీప్ బాగానే కష్టపడ్డాడు. కాకపోతే లీడ్ హీరోయిన్ కు ప్రాధాన్యత లేదో లేక ఎవరూ దొరకలేదో అంత ప్లస్ గా అనిపించలేదు . ఫాంటసీకి క్రైమ్ ని మిక్స్ చేసి దానికి దేవుడికి ముడి పెట్టడం అనే పాయింట్ బాగుంది. జయకృష్ణ-రవి కొమ్మి ఛాయాగ్రహణం ఓకే. పద్నవ్ భరద్వాజ్ సంగీతం సింక్ అయినట్టే అనిపిస్తుంది. హీరో దిలీప్ లేతగానే ఉన్నాడు. ఇంత బరువైన సబ్జెక్టుకు ఎంత మేరకు న్యాయం చేసాడో సినిమా చూశాక కాని చెప్పలేం. చిన్న సినిమాల్లో కాస్త పెద్దదిగా కనిపిస్తున్న దిక్సూచి ఏప్రిల్ లో విడుదల కానుంది