Begin typing your search above and press return to search.
ప్రపంచ రికార్డు ఓపెనింగ్స్ సాధించిన 'దిల్ బేచారా'..!!
By: Tupaki Desk | 30 July 2020 11:10 AM GMTదివంగత బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ చివరి సినిమా దిల్ బేచారా ఇప్పటికి ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ ట్రైలర్ తోనే ప్రపంచాన్ని ఆకర్షించిన దిల్ బేచారా యూట్యూబ్లో 84 మిలియన్లకు పైగా వ్యూస్, 10మిలియన్ పైగా లైక్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది. డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో ఈ నెల 24న విడుదలైన దిల్ బేచారా సినిమా కూడా ప్రస్తుతం రికార్డు వ్యూయర్ షిప్ దక్కించుకుని విజయవంతంగా హాట్ స్టార్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శితం అవుతుంది. ఈ సినిమా విడుదలైన 24 గంటలకే 95మిలియన్ల మంది వీక్షించారు. ప్రస్తుతం ఇది వరల్డ్ రికార్డు అంటూ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలతో దిల్ బేచారా పోటీ పడుతుందట. ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ అందుకున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ 24 గంటలలో 44మిలియన్ల మంది వీక్షించారట. దీని ప్రకారం.. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా దిల్ బేచారా నిలిచిందని ట్రేడ్స్ చెప్తున్నాయి.
ఇటీవల విడుదలైన 'ఎక్సట్రాక్షన్' మూవీ నెల రోజులకు 99మిలియన్లు వీక్షించగా.. దిల్ బేచారా కేవలం 24గంటలలో 95మిలియన్లు సాధించడం నిజంగా విశేషమే. అయితే ఈ సినిమాకు సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ తాజాగా తన ట్విట్టర్లో దిల్ బేచారా గురించి పోస్ట్ చేశారు. సుశాంత్ లాస్ట్ సినిమా థియేటర్లలో విడుదల అయివుంటే ఖచ్చితంగా 2000కోట్లు వసూల్ చేసేదని ఓ నేషనల్ ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. కరోనా వైరస్ వలన దిల్ బేచారా థియేట్రికల్ విడుదలకు నోచుకోలేదు. కానీ టికెట్ రేట్ 100 పెడితే 950కోట్లు, మల్టీప్లెక్స్ రేట్ 207 ప్రకారం అయితే 2000కోట్లు వసూల్ చేసి ఉండేదని ట్రేడ్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో సంజన సంఘీ హీరోయినుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇప్పటి వరకు హాట్ స్టార్ వారు కొత్తగా ప్రారంభించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మల్టీప్లెక్స్ లో ఇదే రికార్డు ఓపెనింగ్స్ అని సమాచారం.