Begin typing your search above and press return to search.

వారసుడు.. రీమేక్.. సీక్వెల్ కానే కాదంటున్న దిల్ రాజు..!

By:  Tupaki Desk   |   25 Dec 2022 9:30 AM GMT
వారసుడు.. రీమేక్.. సీక్వెల్ కానే కాదంటున్న దిల్ రాజు..!
X
దిల్ రాజు నిర్మాణంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వరిసు సినిమా 2023 సంక్రాంతికి భారీగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీని తెలుగులో వారసుడుగా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా వరిసు ఆడియో రిలీజ్ ఈవెంట్ శనివారం చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాపై రీమేక్ వార్తలను మరోసారి ఖండించారు నిర్మాత దిల్ రాజు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని.. అలా అని ఏ సినిమాకు సీక్వెల్ కూడా కాదని అన్నారు.

వరిసు పక్కా తమిళ సినిమా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందని అన్నారు దిల్ రాజు. ఇక హీరో విజయ్ గురించి చెబుతూ అతను నిజమైన సూపర్ స్టార్.. ఆయనతో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు.

వరిసు సినిమాకు దిల్ రాజు దళపతి విజయ్ కు 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్.

వరిసు తెలుగులో వారసుడుగా వస్తుంది. అయితే ఇప్పటివరకు తెలుగులో ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. ఈసారి ఎలాగైనా విజయ్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ భారీ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. విజయ్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు టాక్.

వారసుడు సినిమా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చాలా నమ్మకంగా చెబుతున్నారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా మరో స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది.

సంక్రాంతికి అక్కడ ఆల్రెడీ అజిత్ తునివు రిలీజ్ ఫిక్స్ చేయగా విజయ్ వర్సెస్ అజిత్ సినిమాల మధ్య మరోసారి ఫైట్ జరగబోతుంది. దిల్ రాజు మాత్రం తమిళనాడులో కూడా సాధ్యమైనంత ఎక్కువ థియేటర్లు వరిసు సినిమాకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు తెలుగులో కూడా సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి కి పోటీగా వారసుడు సినిమాని దించుతున్నాడు దిల్ రాజు.