Begin typing your search above and press return to search.
అజ్ఞాతవాసి-30 కోట్ల రిస్క్
By: Tupaki Desk | 3 Jan 2018 6:14 AM GMTఅజ్ఞాతవాసి విడుదల కోసం ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే కోట్లు పోసి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. పవన్ కున్న క్రేజ్ దృష్ట్యా పాత రికార్డులు అన్ని బద్దలు కావడం ఖాయంగానే కనిపిస్తున్నా సంక్రాంతి కాబట్టి మరో మూడు సినిమాల నుంచి పోటీ ఉన్న నేపధ్యంలో మొదటి రెండు రోజుల్లోనే వీలైనంత రాబట్టేలా ప్లానింగ్ లో ఉన్నారు నిర్మాతలు. నైజాం ఏరియా వరకు ఇలాంటి భారీ క్రేజీ సినిమా ఏది వచ్చినా తానే పంపిణి చేసే దిల్ రాజు అజ్ఞాతవాసిని 28.5 కోట్లకు కొన్నట్టు ట్రేడ్ టాక్. అంటే సేఫ్ గా బ్రేక్ ఈవెన్ చేరాలి అంటే కనీసం 30 కోట్లు రావాలి. అది దాటింది అంటే లాభాలే లాభాలు. త్రివిక్రమ్ బ్రాండ్ - మ్యూజిక్ - పవన్ ఇమేజ్ - టీజర్ ఇవన్ని చూస్తుంటే కష్టమేమి కాదు అనిపిస్తుంది కాని ఇక్కడ మరో రిస్క్ పొంచి ఉంది.
అజ్ఞాతవాసి వస్తోంది సంక్రాంతి సీజన్లో. మామూలుగా నైజాంలో రెవిన్యూ పరంగా కీలకంగా భావించేది హైదరాబాదే. కాని సెలవుల సందర్భంగా అధిక శాతం జనాభా తమ స్వంత ఊళ్ళకు, గ్రామాలకు వెళ్ళిపోతారు. బస్సులు - ట్రైన్లు - ఆఖరికి విమానాలు కూడా రద్దీతో కిటకిటలాడుతూ ఉంటాయి. పండగ రెండు రోజులు హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. అందుకే వీలైనన్ని ఎక్కువ షోస్ వేయడంతో పాటు సిటీ మొత్తం 90 శాతం పైగా రెండు రోజులు అజ్ఞాతవాసినే వేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. బాహుబలి 2 తరహాలో ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుమతి రావడం ఆలస్యం భారీ రేట్లతో రెండు రాష్ట్రాల్లో టికెట్ అమ్మకాలు చేపడతారు. మరి మూడు సినిమాల పోటీ, సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ ని తట్టుకుని దిల్ రాజు 30 కోట్ల పెట్టుబడి వెనక్కు తెచ్చుకోవడం కత్తి మీద సామే. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అసాధ్యమూ కాదు.