Begin typing your search above and press return to search.
#RC15 రాజు గారు ఇలా కొంప ముంచారేంటి?
By: Tupaki Desk | 16 Jan 2022 4:57 AM GMTఏదైనా ఒక భారీ పాన్ ఇండియా సినిమాని నిర్మించాలంటే దానికి వందల కోట్ల పెట్టుబడుల్ని సమకూర్చాల్సి ఉంటుంది. ఏ ఒక్కరి వల్లనో అయ్యేది కాదు. బడా నిర్మాణ సంస్థలు ఫైనాన్షియర్లతో టై అప్ లు ఉన్నప్పుడే ఇది సాధ్యం. ఇండస్ట్రీలో అగ్ర పంపిణీదారులు బయ్యర్ల నుంచి ప్రముఖుల నుంచి అండదండలు అవసరం అవుతాయి. ఇక ఇండియన్ కామెరూన్ శంకర్ లాంటి దర్శకుడు ఒక ప్రాజెక్టు కోసం పని చేస్తున్నారంటే డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అయితే అలాంటి సాహసం చేస్తున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇంతకుముందే రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 అనే పాన్-ఇండియన్ చిత్రాన్ని ప్రారంభించారు. రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములుగా చేరింది. జీ వాళ్లు సినిమా కోసం నిధులను వెచ్చిస్తున్నారు. జీ స్టూడియోస్ పెడుతున్న పెట్టుబడికి ఈ సినిమాకి సంబంధించిన అన్ని భాషల నాన్-థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంటారు. అదే సమయంలో అన్ని భాషల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోనున్నారు. ఆ మేరకు డీల్ కుదిరిందని తెలిసింది.
ఆర్.ఆర్.ఆర్ తో ఇప్పటికే చెర్రీ పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకుంటున్నాడు. ఇది శంకర్ తో సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. ఇక ఇప్పటికే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ గా సంచలనాలు సృష్టించారు. ఇవన్నీ నిర్మాతలకు ప్లస్ కానున్నాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని అన్ని భారతీయ భాషలలో విడుదల చేయాలనుకున్నాడు. అందుకే జీస్టూడియోస్ కి నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రమే కట్టబెట్టి థియేట్రికల్ హక్కుల్ని తెలివిగా తన వద్దనే లాక్ చేసారట.
ఇందులో కియరా అద్వానీ కథానాయిక. జయరామ్ -సునీల్-తమన్నా- అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తుండగా టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. 2023 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ బజ్ ఉంది.