Begin typing your search above and press return to search.
ఈ సారి గీత దాటక తప్పలేదు: దిల్ రాజు
By: Tupaki Desk | 11 Jan 2022 4:30 AM GMTదిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆయన సోదరుడి తనయుడైన ఆశిష్ హీరోగా వస్తున్నాడు. 'రౌడీ బాయ్స్' ద్వారా ఆయన తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆశిష్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా, నిన్న రాత్రి బన్నీ ముఖ్య అతిథిగా సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ .. "ముందుగా బన్నీకి థ్యాంక్స్ చెబుతున్నాను. నిజం చెప్పాలంటే ఆయనకి నాకు మధ్య థ్యాంక్స్ ఉండవు. 2004 జనవరి 1వ తేదీన 'ఆర్య' సినిమాలో 'తకధిమితోమ్' అనే పాటను వైజాగ్ లో షూట్ చేస్తున్నప్పుడు, ఆశిష్ వయసు ఏడేళ్లు.
ఆ సాంగ్ కి బన్నీ డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ నుంచున్నాడు. అలాంటి ఆశిష్ హీరోగా .. ఆయన డాన్స్ చేసిన సాంగ్ ను బన్నీ లాంచ్ చేయడం విశేషం. నిజంగా ఆశిష్ కి ఇది చాలా గ్రేట్ డే. లైఫ్ లాంగ్ ఆయన జర్నీలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. ఇప్పటివరకూ వచ్చిన సాంగ్స్ బాగున్నాయని అంటున్నారు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ 6 మిలియన్ వ్యూస్ క్రాస్ అయ్యాయి. ఆడియన్స్ చాలా బాగా లైక్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మా బ్యానర్ నుంచి వస్తోంది. 15 నుంచి 25 ఏజ్ గ్రూప్ అబ్బాయిలు .. అమ్మాయిలు థియేటర్లో ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.
ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. 'ప్రేమదేశం'లాగా .. 'తొలిప్రేమ'లాగా .. మా 'ఆర్య'లాగా .. 'హ్యాపీడేస్'లాగా యూత్ కంటెంట్ తో వస్తోంది. జనవరి 14న ఎంజాయ్ చేయడానికి యూత్ అంతా కూడా రెడీగా ఉండండి. మీకు కావలసిన ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది .. అది మా గ్యారెంటీ. దర్శకుడు హర్ష తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ లను కలుపుతూ .. యూత్ కి కావలసిన కంటెంట్ ను అందించాడు. ఇందాక సెన్సార్ వారు 'సార్ ఇది మీ సినిమానా?' అన్నారు. నా సినిమాలన్నీ కొంచెం పద్ధతిగా ఫ్యామిలీస్ తో వెళ్లేలా ఉంటాయి. ఈ సినిమాకి కొంచెం బోర్డర్ దాటాము .. ఎందుకంటే ఆశిష్ లాంచింగ్ కావడం వలన.
హర్ష .. ఈ సినిమా కోసం రెండు మూడేళ్లు కేటాయించాడు. అందుకు నేను ఆయనకి థ్యాంక్యూ చెబుతున్నాను. ఆశిష్ ఫ్యూచర్ కి మంచి సినిమా ఇచ్చాడు. ఇదే మాట జనవరి 14న ఆడియన్స్ కూడా చెబుతారు. థియేటర్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఒక మంచి సినిమాను చూశామని అంటారు. ఆశిష్ గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడేదేమీ లేదు. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ చూసిన వాళ్లంతా పాజిటివ్ గా చెబుతున్నారు. కానీ ఆడియన్స్ చెప్పేవరకూ మేము వెయిట్ చేయవలసిందే. ఇంతవరకూ మా బ్యానర్ నుంచి సంక్రాంతికి వచ్చిన 5 సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సంక్రాంతికి ఈ సినిమా సక్సెస్ అయితే సెకండ్ హ్యాట్రిక్ కంప్లీట్ అవుతుంది. తప్పకుండా హిట్ కొడుతుందనే ఒక నమ్మకంతో ఉన్నాము" అని చెప్పుకొచ్చాడు.