Begin typing your search above and press return to search.
ఈ సంక్రాంతికి డబుల్ హ్యాట్రిక్ కొట్టేస్తాం:దిల్ రాజు
By: Tupaki Desk | 13 Jan 2022 4:30 AM GMTదిల్ రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ, 'రౌడీ బాయ్స్' సినిమాను నిర్మించాడు. ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా, చరణ్ చీఫ్ గెస్టుగా హాజరుకాగా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకలో దిల్ రాజు .. 'జై చరణ్ .. జై జై చరణ్' అంటూ స్టేజ్ పైకి వచ్చారు. దాంతో మెగా అభిమానులంతా ఈలలు .. గోలలు చప్పట్లు. దిల్ రాజు మాట్లాడుతూ . "ముందుగా మెగా పవర్ స్టార్ చరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఈవెంట్ గురించి ఆయన 'గోవా' నుంచి వచ్చారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను.
'దిల్' సినిమా చేస్తున్నప్పుడు సక్సెస్ కావాలి .. అయింది. రెండవ సినిమా'ఆర్య' చేస్తున్నప్పుడు హిట్ కొట్టాలి .. హిట్ అయింది. రెండు సినిమాలు పూర్తయిన తరువాత హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అనుకున్నాము. 'భద్ర' సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాము. అలా వరుస సక్సెస్ లతో వెళుతున్నప్పుడు చైతూ 'జోష్' శాటిస్ ఫై సినిమా కాలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లడం వలన అలా జరిగింది. అప్పుడు రియలైజ్ కావడం జరిగింది. ఆ తరువాత 'బృందావనం' .. 'మిస్టర్ పెర్ఫెక్ట్'తో మళ్లీ సక్సెస్ లు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఒక ఫ్లాప్ .. ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి.
2017కి ముందు సక్సెస్ లు వస్తున్నాయి గానీ సంతృప్తి లేదు. అప్పుడు 'శతమానం భవతి' నుంచి 'ఎంసీఏ' వరకూ మా దర్శకులు సిక్స్ సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆ ఆరుగురు దర్శకులకు మళ్లీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే 2017 నేను ఎప్పటికీ మరిచిపోలేని సంవత్సరం. ఆ తరువాత 'ఎఫ్ 3' .. 'మహర్షి' వంటి హిట్లు పడ్డాయి. 2019లో ఆశిష్ ను హీరోను చేయాలనుకున్నాము. హర్ష దర్శకత్వంలో యూత్ ఫుల్ కంటెంట్ తో సెట్స్ పైకి వెళ్లాము. తీస్తున్నాము .. కోవిడ్ రాగానే ఆపుతున్నాము. మా ముందున్నది ఒకటే గోల్ .. ఈ సినిమా హిట్ కొట్టాలి.
'దిల్' సినిమా సమయంలో ఉన్న పట్టుదలను .. 2017లో ఉన్న పట్టుదలను .. 'రౌడీ బాయ్స్'కి తెచ్చుకున్నాను. 25 ఏళ్లలో ఇండస్ట్రీలో మేము ఎంతోమంది స్టార్స్ తో సక్సెస్ ఫుల్ సినిమాలు తీశాము. ఇన్నేళ్లలో మా బ్యానర్ కి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. అలాంటిది మా ఇంట్లో నుంచి ఒక కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే మరింత బాధ్యత పెరిగింది. 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' పక్కకి జరగడం వలన, ఆశిష్ కి సంక్రాంతికి రావడం కుదిరింది. అలాగే ఇంతకుముందు ఐదు సంక్రాంతులు హిట్స్ కొట్టాము. ఈ సంక్రాంతికి కూడా ఈ సినిమాను బాగా రెడీ చేశాము.
ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నాయి. సమయం లేకపోవడం వలన ఈ ఒక్కరోజునే 4 పాటలను రిలీజ్ చేశాము. ఫైనల్ మిక్సింగ్ లో ఉండటం వలన దేవిశ్రీ ఇక్కడికి రాలేకపోయాడు. ఇంతవరకూ ఐదు సంక్రాంతులు ఎలా హిట్లు కొట్టామో ఆరో సంక్రాంతికి కూడా ఈ సక్సెస్ ఫుల్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాము. ఈ సంక్రాంతి మాదేనని అనిపించుకుంటామనే నమ్మకంతో ఉన్నాము" అంటూ చెప్పుకొచ్చాడు.