Begin typing your search above and press return to search.
రాజు గారు.. ఫ్యాన్స్ కు చెప్పగలరా?
By: Tupaki Desk | 18 July 2017 7:52 AM GMTఇప్పుడు దిల్ రాజు అన్న ఒక మాట ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే.. డిజె దువ్వాడ జగన్నాథమ్ వెనుక నెగెటివ్ టాక్ ను కొందరు ఫ్యాన్స్ కు ఆపాదిస్తూ.. రాజు గారు ఒక మాటన్నారు. ''ఇప్పుడు ఈ హీరో పై వేరే హీరో ఫ్యాన్స్ నెగెటివ్ గా ప్రచారం చేస్తే.. రేపు ఆ హీరో పై ఇంకొక ఫ్యాన్ గ్రూప్ నెగెటివ్ గా చెబుతుంది. అందుకే మన హీరోలందరూ వాళ్ళ అభిమానులకు ఇలా చేయొద్దని చెప్పాలి'' చెప్పారాయన. బాగానే ఉంది కాని.. అసలు ఫ్యాన్స్ కు ఏ హీరో మాత్రం పిలిచి అలా చెప్పగలడు.
ఒకానొక టైములో ఇద్దరు పెద్ద తెలుగు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో దూషించుకుంటుంటే.. మీ అభిమానులకు చెప్పకూడదా అంటూ ఒక సూపర్ స్టార్ ను అడిగితే.. 'అసలు ఫ్యాన్స్ కు ఏమని చెబుతామండీ? వారికి ఎక్సయిట్మెంట్ ఆగదు. కాబట్టి వాళ్లిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తుంటారు. వారిని అలా వదిలేస్తే బెటర్' అంటూ కామెంట్ చేశాడు. అబ్బే మనం అలా చేయకుండా ఫ్యాన్స్ కు కాస్త గట్టిగా చెబుదాం అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో 'చెప్పను బ్రదర్' అనే మాటను అనేసి అల్లు అర్జున్ ఎంత నెగెటివ్ ఎటాక్ కు గురయ్యాడో కూడా చూశాం. ఇప్పుడు ఏ హీరో మాత్రం బయటకు వచ్చి తన ఫ్యాన్స్ కు మీరు వేరే హీరోలను ఏమీ అనకండి అని చెప్పగలడు? అలా చెబితే ఆ ఫ్యాన్స్ రివర్స్ అయ్యే ఛాన్సుంది. అలాగే అమాయకులైన ఫ్యాన్స్ మా హీరో మమ్మల్ని తిట్టాడు అని ఫీలయ్యే ఛాన్సుంది. కాబట్టి ఏ హీరో కూడా ఓపెన్ గా ఏమీ చెప్పలేడు. ఆ లెక్కన రాజు గారి కోరిక తీరదు.
ఇకపోతే ఫ్యాన్ వార్స్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా హీరోలు కామెంట్లు మానేస్తే బెటర్. వారి సినిమాల్లో ఇతర హీరోలపై పంచులు.. వారి ప్రమోషన్లలో ఇతర స్టార్ల తీరుపై కామెంట్లు చేయకుండా ఉంటే చాలు. ఇతర హీరోలు చేసే రీమిక్స్ పాటలపై .. ఇతర సినిమాల కలక్షన్లపై.. ఇతర హీరోల ఎంపికపై.. కామెంట్లు చేయకుండా ఉంటే.. అసలు ఫ్యాన్స్ మధ్యన చిచ్చు అనేదే రగలదు. ఏమంటారు రాజు గారు?