Begin typing your search above and press return to search.
దిల్ రాజుపై దేవిశ్రీ ప్రేమ ఏమైంది?
By: Tupaki Desk | 10 Oct 2018 1:30 AM GMTతెలుగులో దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ లెవెల్లో సాగుతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ రెండు దశాబ్దాల్లో ఎందరో సంగీత దర్శకులు వచ్చారు. వెళ్లారు. కానీ దేవిశ్రీ స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. మధ్య మధ్యలో కొంచెం జోరు తగ్గినట్లు అనిపించినా.. మళ్లీ పుంజుకుని తన స్థాయి ఆడియోలతో శ్రోతల్ని ఆకట్టుకున్నాడు. దేవిశ్రీకి టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న నిర్మాణ సంస్థల్లో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ ఒకటి. దేవి ఎదుగుదలలో కూడా ఈ సంస్థ పాత్ర ఉంది. దిల్ రాజు బేనర్లో అత్యధిక చిత్రాలకు సంగీతం అందించింది దేవీనే. ‘ఆర్య’.. ‘భద్ర’.. ‘బొమ్మరిల్లు’.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’.. ‘ఎవడు’.. ‘నేను లోకల్’.. ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్లిచ్చాడు దేవి. దిల్ రాజు సినిమా అంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి పాటలు చేస్తాడని దేవికి పేరుంది.
కానీ ఈ మధ్య ఈ సంస్థకు దేవి చేస్తున్న పాటలు నిరాశ పరుస్తున్నాయి. చివరగా అతను దిల్ రాజు బేనర్లో చేసిన ‘ఎంసీఏ’ ఆడియో నిరాశ పరిచింది. అప్పట్లో దేవి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడి స్థాయికి తగ్గ పాట ఒక్కటీ లేదని జనాలు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థలో దేవి చేస్తున్న కొత్త సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’లో తన సత్తా చూపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ ఆడియో కూడా ప్రేక్షకులకు అంతగా రుచించట్లేదు. ఇంతకుముందు రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ ‘మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్’.. ‘నేటివ్ ప్లేస్’ చాలా సాధారణంగా అనిపించాయి. ఫుల్ ఆడియోలో అయినా ప్రత్యేమైన పాటలుంటాయేమో అనుకుంటే అదీ అంతంతమాత్రంగానే ఉంది. ‘హలో గురూ ప్రేమ కోసమే’ టైటిల్ సాంగ్ అయితే చాలా సాధారణంగా అనిపిస్తోంది. దీని బదులు ‘నిర్ణయం’లోని పాటను రీమిక్స్ చేసినా బాగుండేదన్న కామెంట్లు పడుతున్నాయి. నిజానికి రాజు బేనర్లో దేవి చేసిన ‘నేను లోకల్’.. ‘దువ్వాడ జగన్నాథం’ ఆడియోలు కూడా అంతకుముందు అతడి స్థాయికి తగినవి కావు. ఐతే వీటి తర్వాత మరింతగా క్వాలిటీ పడిపోయింది. ఇంతకుముందు రాజు మీద అదనపు ప్రేమ చూపించిన దేవి.. ఇప్పుడు మామూలు స్థాయిలో కూడా లవ్ చూపించట్లేదే అని జనాలు కామెంట్లు విసురుతున్నారు.