Begin typing your search above and press return to search.

దిల్‌ రాజు - ఎన్వీలో టెన్ష‌న్ ఎందుకు?

By:  Tupaki Desk   |   27 Nov 2018 5:09 AM GMT
దిల్‌ రాజు - ఎన్వీలో టెన్ష‌న్ ఎందుకు?
X
దాదాపు 600కోట్ల బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కించిన 2.ఓ మ‌రో 24గంట‌ల త‌ర్వాత ఏం చేయ‌బోతోంది? ఎలాంటి రికార్డుల‌కు తెర‌తీయ‌బోతోంది? ప‌్ర‌స్తుతం సినీవ‌ర్గాల్లో - ఆడియెన్‌ లో ఒక‌టే క్యూరియాసిటీ ఇది. ఇక ర‌జ‌నీ - శంక‌ర్ అభిమానుల్లో దీనిపై బోలెడంత డిబేట్ న‌డుస్తోంది. ముఖ్యంగా త‌మిళ‌నాడు కంటే 500 స్క్రీన్లు అద‌నంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌. అంటే ఇక్క‌డ కూడా 2.ఓ చిత్రం రికార్డుల్ని వేటాడుతుందా? అన్న ఆస‌క్తి ట్రేడ్‌ లో నెల‌కొంది. బ‌డ్జెట్‌ ని ఆరు ముక్క‌లు చేస్తే ఒక వంతు బ‌డ్జెట్‌(80కోట్లు)ని టాలీవుడ్ రైట్స్ కొన్న వాళ్లు లైకా సంస్థ‌కు చెల్లించార‌నుకుంటే 2.ఓ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వ‌సూలు చేయాలి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. 100కోట్ల షేర్ గ్యారెంటీగా తీయాలి. 150-200కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచే వ‌సూలు చేయాలి. అలా జ‌ర‌గాలంటే 2.ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ - సెన్సేష‌న‌ల్ హిట్ అన్న టాక్ మొద‌టి రోజు రావాలి. కానీ అలా జ‌రుగుతుందా? అంటే వేచి చూడాల్సిన ప‌రిస్థితి.

నిన్న‌టిరోజున 2.ఓ హైద‌రాబాద్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో తెలుగు వెర్ష‌న్ నిర్మాత‌ల్ని చూస్తే ఏదో తెలియ‌ని టెన్ష‌న్. 80 కోట్ల మేర బెట్టింగ్... అందుకే చెమ‌ట‌ల‌తో త‌డిసిపోతున్నారేమో అనిపించింది. 2.0 తెలుగు వెర్ష‌న్ నిర్మాతలు ప్ర‌మోష‌న్స్ కోసం ఎంతో త‌పించారు. అందుకోసం శంక‌ర్ - ర‌జ‌నీ - అక్ష‌య్ బృందాన్ని హైద‌రాబాద్‌ కి ర‌ప్పించేందుకు నానా ప్ర‌యాస‌లు ప‌డ్డారు. ఆ మాట‌ను వేదిక‌పైనే అటూ ఇటూగా ఒప్పుకున్నారు. అడ‌గ్గానే ప్లాన్ మార్చుకుని .. విమానం టిక్కెట్టు క్యాన్సిల్ చేసుకుని మ‌రీ అక్కీ హైద‌రాబాద్‌ కి ప‌య‌న‌మ‌య్యార‌ని చెప్పారు. ముంబై - చెన్న‌య్ - దుబాయ్‌ లో ప్రెస్‌ మీట్లు పెట్టి ప్ర‌చారం చేస్తారు కానీ - హైద‌రాబాద్‌ లో చేయ‌రా? అని నిర్మాత‌లు బ‌తిమాలుకోవాల్సి వ‌చ్చింద‌ని స‌న్నివేశం చెప్పింది.

మ‌రోవైపు టాలీవుడ్ మీడియా ఈ సినిమాకి స‌రైన ప్ర‌మోష‌న్ లేద‌ని షంటేస్తోంది. దీంతో నిర్మాత‌ల్లో ఏదో టెన్ష‌న్. తేడాలొస్తే అన్న‌దే ఆ అటెన్ష‌న్.. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లోనూ దిల్‌ రాజు అసౌక‌ర్యంగా క‌నిపిస్తే... ఎన్వీ ప్ర‌సాద్ బిగుసుకుపోయి క‌నిపించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఆ ఇద్ద‌రూ 2.0 వేదిక‌పైనా క్లుప్తంగా మాట్లాడారు. వీళ్ల‌లో ఏదో తెలియ‌ని టెన్ష‌న్ అలుముకుంద‌ని అర్థ‌మైంది అంద‌రికీ. అంతేనా స్టార్ల‌ను ప్ర‌మోష‌న్ కోసం బ‌ల‌వంతంగా లాక్కుని రావ‌డం .. ఇక్క‌డ ప్రోటోకాల్ మెయింటెయిన్ చేయ‌డం ఇదంతా చాలా త‌ల‌నొప్పిగానే మారింద‌ని సీన్ చూస్తే అర్థ‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌చారం వ‌చ్చేశాక ఇక టాలీవుడ్‌ లో ప్ర‌చారం ఎందుకులే అని లైకా అధినేత సుభాష్ క‌ర‌ణ్ సైతం ఫిక్స‌వ్వ‌డం వ‌ల్ల అటువైపు చెన్న‌య్ - ముంబై ప్ర‌చారానికి స‌రిగా స‌మ‌యం చాల‌క పోవ‌డం వ‌ల్ల ఆ టెన్ష‌న్ - ఈ టెన్ష‌న్ మ‌నోళ్ల నెత్తిన గుదిబండ‌లా ప‌డింద‌ని తెలుస్తోంది. ఇంత భారీ సినిమాకి ప్ర‌చారం అంటే మామూలు కాదు. పైగా ఒకేసారి అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయ‌డం అంటే ప్ర‌చారార్భాటం ఎంత చేసినా చాల‌దు. ట్రైల‌ర్ న‌చ్చినా స్టార్లు క‌నిపిస్తేనే జ‌నాల్ని కాస్తంత థియేట‌ర్ల వ‌ర‌కూ రప్పించ‌గ‌లుగుతున్నారు. నేరుగా జ‌నాల‌తో ఇంట‌రాక్ట్ అయితే ఆ కిక్కులో జ‌నం మ‌రింత‌గా థియేట‌ర్ల‌ వైపు వ‌స్తున్నారు. కానీ అది చేయ‌డంలో 2.ఓ టీమ్ త‌డ‌బ‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అయితే ఏదో ఎవ‌రో చెప్పిన‌ట్టు ప్ర‌చారం వ‌చ్చేసింద‌ని ఎవ‌రో భావించినా దిల్ రాజు లాంటి మొండిఘ‌టం చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తే లేదు. అందుకే వీళ్లంతా ప‌ట్టుద‌ల‌గా ప్ర‌మోష‌న్స్ ని ప్లాన్ చేశారు. ఇంకా మునుముందు ప్ర‌చారం చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌.