Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: రాజుగారితోనే విభేధించాడా?
By: Tupaki Desk | 23 Feb 2019 5:05 AM GMTతమిళ బ్లాక్ బస్టర్ 96 తెలుగు రీమేక్ గురించి ఒక్కో ఆసక్తికర విషయం లీకవుతున్నాయి. ఈ సినిమా రీమేక్ హక్కులు చేజిక్కించుకున్న దిల్ రాజు ఇప్పటికే మాతృక దర్శకుడు సి.ప్రేమకుమార్ ని బరిలో దించి తెలుగు వెర్షన్ స్క్రిప్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సమంత- శర్వానంద్ జంటగా నటిస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. తొందర్లోనే అధికారికంగా మరింత సమాచారం రానుందని తెలుస్తోంది. అయితే ఈలోగానే ఈ సినిమా విషయమై తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు....
నిర్మాత దిల్ రాజు - దర్శకుడు ప్రేమ్ కుమార్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని తెలుస్తోంది. స్క్రిప్టులో సృజనాత్మకత విషయంలో.. అలానే ఈ సినిమాకి ఎంపిక చేసుకోవాలనుకుంటున్న సంగీత దర్శకుడి విషయంలోనూ ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు విభేధిస్తున్నారట. 96 స్క్రిప్టును యథాతథంగా తెలుగైజ్ చేసి తెరకెక్కిస్తేనే బెటర్ అని దర్శకుడు భావిస్తుంటే, అలా కాదు.. తెలుగు నేటివిటీ - తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేర్పులు చేయాల్సిందేనని నిర్మాత దిల్ రాజు ఖరాకండిగా తెగేసి చెప్పారట. అంతేకాదు.. మాతృకకు సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగు వెర్షన్ కి సంగీతం అందిస్తే బావుంటుందని దర్శకుడు భావిస్తుంటే, అందుకు రాజుగారు ససేమిరా అంటున్నారట. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లకు పని చేసిన ఓ సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకోవాలని దిల్ రాజు చెబుతున్నారట. నటీనటుల ఎంపిక విషయంలో రాజుగారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నా ఇతర విషయాల్లో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని తెలుస్తోంది. అయితే అండర్ ప్రొడక్షన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఆరంభం నుంచి ఈ తరహా ప్రచారం సాగుతూనే ఉంది. అయితే విభేధాలు రాకుండా సరి చేసుకుని సర్ధిచెప్పుకుని ముందుకు వెళ్లడం లో రాజుగారి స్టైలే వేరు అనడంలో సందేహమేం లేదు.
96 చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడలోనూ తెరకెక్కిస్తున్నారు. అక్కడ భావన- గణేష్ జంటగా నటిస్తున్నారు. ప్రీతమ్ గుబ్బి దర్శకత్వం వహించనున్నారు. అర్జున్ జాన్య ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇది అతడికి 100వ సినిమా అని తెలుస్తోంది. రాము ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.