Begin typing your search above and press return to search.
సెన్సేషన్ అనుకుంటే ముందే లీక్
By: Tupaki Desk | 1 Oct 2017 3:35 AM GMTఅటు చిన్న చిత్రాలకు సమర్పకుడిగా.. మీడియం బడ్జెట్ చిత్రాలతో పాటు భారీ చిత్రాల నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా.. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ వ్యవహరిస్తారు దిల్ రాజు. ఇండియా మొత్తం గొప్పగా చెప్పుకునే.. చిరకాలం జనాలకు గుర్తుండిపోయేలా తన బ్యానర్ పై ఓ సినిమా తీయాలన్నది ఆయన టార్గెట్.
ఇందుకోసం భారీ కాంబినేషన్ నే సెట్ చేసుకున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా.. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడైన శంకర్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్టును.. దసరా నాడు గ్రాండ్ అనౌన్స్ మెంట్ ఇవ్వాలని భావించారు దిల్ రాజు. ఇందుకోసం చెన్నైలో పెద్ద ఏర్పాట్లనే చేసుకున్నారు కూడా. అయితే.. ఈ విషయంలో ఎలా లీక్ అయిందో కానీ.. ముందుగానే ట్విట్టర్ లో ప్రత్యక్షం అయిపోయింది. ప్రస్తుత రాజకీయాలు.. అవినీతి.. ప్రక్షాళన కాన్సెప్టులుగా ఈ చిత్ర కథ ఉంటుందనే ప్రచారం కారణంగా.. ఇది భారతీయుడు2 అనే ప్రచారం సాగింది. కొన్నేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీ కూడా దేశభక్తి.. అవినీతి థీమ్ తో రూపొందిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కొత్త కథలను వండడం మానేసి తన పాత హిట్ సినిమాలకే సీక్వెల్స్ తీసేందుకు శంకర్ ప్రణాళికలు వేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇందులో భాగంగానే మొదట రోబో సీక్వెల్ గా 2.0 చేస్తున్నారు. ఆ తర్వాత భారతీయుడు2 తీస్తారట. దీనికి రెండు భాషల్లోనూ దిల్ రాజు నిర్మాతగా ఉంటారని అంటున్నారు. అయితే.. అనౌన్స్ మెంట్ తోనే సెన్సేషన్ సృష్టించాలని భావిస్తే.. ట్విట్టర్ కూతల కారణంగా ముందే పాకిపోయింది.