Begin typing your search above and press return to search.
దిల్ రాజు-భారతీయుడు.. ఒక ఆసక్తికర కథ
By: Tupaki Desk | 1 Oct 2017 8:48 AM GMTమొత్తానికి రెండు రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. భారతీయుడు సీక్వెల్ కు దిల్ రాజు నిర్మాత అవుతున్నాడు. విజయ దశమి రోజు రాజు.. శంకర్-కమల్ హాసన్ జోడీని కలిసిన ఫొటో కూడా బయటికి వచ్చింది. ఈ ముగ్గురు కాంబినేషన్లో భారతీయుడు-2 రాబోతున్నట్లు రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ ట్విట్టర్ పేజీలో అనౌన్స్ మెంట్ కూడా చేసేశారు. దీంతో శంకర్-కమల్ భారతీయుడు సీక్వెల్ తీస్తున్న సంగతి తమిళ మీడియాకు కూడా అధికారికంగా వెల్లడైంది. భారతీయుడు-2ను తెలుగు వరకే కాదు తమిళ.. హిందీ భాషల్లోనూ దిల్ రాజే నిర్మిస్తున్నట్లు సమాచారం.
విశేషం ఏంటంటే.. దాదాపు రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ సినిమాలోనూ దిల్ రాజుకు భాగస్వామ్యం ఉంది. ఆయన ఆ చిత్రాన్ని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. రాజు డిస్ట్రిబ్యూటర్ గా తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఆయన ‘భారతీయుడు’ సినిమాను పంపిణీ చేశాడు. ఆ సినిమా రాజుకు మంచి లాభాలందించిన డిస్ట్రిబ్యూటర్ గా నిలదొక్కుకునేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక చిత్ర సీక్వెల్ ను రాజే నిర్మించబోతున్నాడు. శంకర్ నిర్మాణంలో వచ్చిన ‘వైశాలి’ సినిమాను రాజే తెలుగులోకి అందించాడు. అప్పట్నుంచి శంకర్ తో రాజుకు మంచి పరిచయమే ఉంది. వీరి కలయికలో రాబోయే భారతీయుడు-2 ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.