Begin typing your search above and press return to search.
'పళ్లున్న చెట్టుపైనే రాళ్లు' అంటూ కవర్ చేసిన రాజు గారు!
By: Tupaki Desk | 10 Feb 2021 11:35 AM GMTసినీపరిశ్రమ రాజకీయాల గురించి నిరంతరం ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంది. నిర్మాతల మండలి వర్సెస్ నిర్మాతల గిల్డ్ వార్ గురించి తెలిసినదే. ఇక పెద్దలంతా ఉన్న నిర్మాతల గిల్డ్ లోనే దిల్ రాజు వర్సెస్ డి.సురేష్ బాబు వ్యవహారంపై ఇటీవల చర్చ సాగుతోంది. నైజాం టు ఆంధ్రా థియేటర్లలో అద్దె వ్యవస్థకు బదులుగా పర్సంటేజీ షేర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న డిమాండ్ కి సురేష్ బాబు మద్ధతు పలకడం దిల్ రాజు దానిని అంగీకరించకపోవడం తెలిసినదే.
ఇదిలా ఉండగానే.. ఇప్పటికే నైజాం పంపిణీదారుడు వరంగల్ శ్రీను నేరుగానే దిల్ రాజు- శిరీష్ బృందాన్ని ఎటాక్ చేశారు. క్రాక్ బాగా ఆడుతున్నా థియేటర్లు గుప్పిట పెట్టుకుని దిల్ రాజు ఇవ్వలేదని ఆరోపించారు. అయితే గడిచిన రోజుల్లో ఇవన్నీ దిల్ రాజును కలతకు గురి చేసాయని మీడియాలో కథనాలు తామర తంపరగా ప్రచారం అయ్యాయి.
అయితే దీనికి దిల్ రాజు ఆన్సర్ ఏమిటి? అన్నది ఇంతవరకూ తెలీదు. తాజాగా ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ ఆయన వివరణ ఇచ్చారు. ''పళ్ళున్న చెట్టుకే రాళ్ళు... ఎండిపోయిన చెట్టుపైన ఎవ్వరూ రాళ్ళు వెయ్యరు. ఆ నిజాన్ని నేను ఎప్పుడూ మరచిపోను'' అంటూ నర్మగర్భంగా మాట్లాడారు దిల్ రాజు. అయినా దిల్ రాజు మీద రాస్తే చదువుతారు కానీ.. ఏ పుల్లయ్యమీదో రాస్తే చదవరు కదా` అని దిల్ రాజు అన్నారు. అలాగే కౌన్సిల్ చాంబర్ తో సంబంధం లేని గిల్డ్ అందరూ కలిసి సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నది అని కూడా దిల్ రాజు వివరణ ఇచ్చారు.