Begin typing your search above and press return to search.

రాజా లెక్క బ్యాలెన్స్ అయ్యేదెపుడు?

By:  Tupaki Desk   |   3 Nov 2018 10:57 AM GMT
రాజా లెక్క బ్యాలెన్స్ అయ్యేదెపుడు?
X
అగ్రనిర్మాత కం డిస్ట్రిబ్యూట‌ర్ దిల్‌ రాజు లెక్క స‌ర‌య్యేదెపుడు? ఆయ‌న‌ ఏ సినిమా చేసినా సూప‌ర్ హిట్ అని న‌మ్ముతారంతా. రాజుగారి జ‌డ్జిమెంటుకు తిరుగే లేద‌న్న పేరు ఇండ‌స్ట్రిలో ఉంది. కానీ ఏడాది కాలంగా స‌న్నివేశ‌మే వేరుగా ఉంది. దిల్ రాజు తీసిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కోట్టేయ‌డం మార్కెట్ వ‌ర్గాల్ల చ‌ర్చ‌కు తెర‌తీసింది. గ‌త యేడాది ఆరు విజయాల‌ను అందుకున్న దిల్ రాజు ఈ యేడాది ఒక్క విజ‌యాన్ని కూడ అందుకోలేక‌పోయారు. ఇప్ప‌టికే శ్రీ‌వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ నుండి మూడు సినిమాలు వ‌చ్చి వెళ్లాయి...

రాజ్‌ త‌రుణ్ `ల‌వ‌ర్‌` - నితిన్ `శ్రీ‌నివాస క‌ళ్యాణం` - రామ్ `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` రిలీజై వెళ్లాయి. ఇందులో `ల‌వ‌ర్‌` - `శ్రీ‌నివాస క‌ళ్యాణం` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఘోర ప‌రాజ‌యం పాల‌వ్వ‌గా - ద‌సరా కానుక‌గా విదుద‌లైన `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` ప‌ర్వాలేద‌నిపించినా - అశించిన స్థాయిలో అడ‌లేదు. గ‌త యేడాది ఆరు సినిమాలు చేసిన దిల్ రాజు ఈ యేడాది ఏడు సినిమాలు చేస్తాన‌ని అన్నారు. కానీ చేసిన మూడు సినిమాలు ఆడ‌క‌పోవ‌డంతో రాజా లెక్క పూర్తిగా గ‌తి త‌ప్పింది.

ఇక హోప్స్ అన్నీ రానున్న సినిమాల‌పైనే. ప్ర‌స్తుతం నిర్మిస్తున్న‌ `ఏఫ్‌ 2` `మ‌హ‌ర్షి` చిత్రాల మీద‌నే అశ‌ల‌న్ని పెట్టుకున్నార‌ట‌. ఈ రెండు చిత్రాల్లో వెంక‌టేశ్‌ - వ‌రుణ్ తేజ్ ల‌తో అనీల్ రావిపూడి తేర‌కేక్కిస్తున్న `ఏఫ్‌ 2` చిత్రం వ‌చ్చే యేడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అలాగే మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి ల కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కుతున్న‌ `మ‌హ‌ర్షి` చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో విడుద‌లకానుంది. ఈ రెండు చిత్రాలైనా దిల్ రాజుకు గ‌త వైభ‌వం తిరిగి తెస్తాయో లేదో అన్న‌ది వేచి చూడాలి. ఆస‌క్తిక‌రంగా 2018 మోస్ట్ అవైటెడ్ మూవీ `2.ఓ`లో దిల్‌ రాజు కూడా భాగ‌స్వామి అయ్యారు. ఆ సినిమా నైజాం రైట్స్ ఆయ‌న చేతిలోకి వ‌చ్చాయ‌ని వార్తలొచ్చాయి. ఆ క్ర‌మంలోనే అన్నిట్లో పోగొట్టుకున్నా, ఆ ఒక్క సినిమాతో ఓ ఊపు ఊపుతారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ నేటి ట్రైల‌ర్ రిలీజ్ వేళ సాగిందిట‌. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.