Begin typing your search above and press return to search.

మాతృభాష‌లో అల్లు అర్హ ఐకాన్ !

By:  Tupaki Desk   |   29 March 2023 9:30 AM GMT
మాతృభాష‌లో అల్లు అర్హ ఐకాన్ !
X
`శాకుంత‌లం` చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టీ అల్లు అర్హ బాల న‌టిగా ప‌రిచ‌యమ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత శకుంత‌ల పాత్ర‌లో న‌టించ‌గా.. క్యూటీ అర్హ చిన్న‌నాటి భ‌ర‌తుడు పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ పాత్ర‌లో అల్లు అర్హ ఎలా క‌నిపించ‌నుంది? అని ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ని తాజా ప్ర‌చార వేదిక‌పై ప్ర‌శ్నిస్తే దానికి అత‌డు అద్బుత‌మైన జ‌వాబిచ్చారు.

శాకుంత‌లం చిత్రంలో భ‌ర‌తుడి పాత్ర చాలా ముఖ్య‌మైన పాత్ర‌. ప్రీక్లైమాక్స్ లో ఈ పాత్ర వ‌స్తుంది. దానికి స్టార్ కిడ్ అయితే బావుంటుంద‌నిపించింది. నీలిమ గుణ‌ వెంట‌నే ఇన్ స్టాలో బ‌న్ని షేర్ చేసిన క్యూట్ అర్హ ఫోటోని చూపించింది. వెంట‌నే బ‌న్నీని సంప్ర‌దించ‌గా అత‌డు ఒప్పుకోవ‌డం ఆనందాన్నిచ్చింది.

బ‌న్ని తెలుగు సంస్కృతిని కాపాడే గౌర‌వించే హీరో. రుద్ర‌మ‌దేవి లాంటి చారిత్రాత్మ‌క చిత్రం గుణ చేస్తున్నారంటే ``దానికి నేనేం చేయాలి?`` అంటూ బ‌న్ని గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌లో న‌టించారు. ఇప్పుడు శాకుంత‌లం కోసం అడ‌గ‌గానే వెంట‌నే త‌ట‌ప‌టాయించ‌కుండా ఓకే చెప్పాడు. ``మా పాప కావాలా తీసుకోండి`` అంటూ అప్ప‌జెప్పాడు. అదంతా అటుంచితే.. అర్హ ఆ ఇంట పెరిగిన తీరు ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

అల్లు అర్హ‌కు మొత్తం తెలుగు భాష‌ త‌ప్ప ఇంగ్లీషే నేర్ప‌లేదు. మాతృభాష‌కు వారిచ్చే గౌర‌వం అలాంటిది. అంత స్ప‌ష్ఠంగా అల్లు అర్హ తెలుగు మాట్లాడుతోంది. ఎక్క‌డా ఆంగ్ల ప‌దం అనేది త‌న మాట‌ల్లో వినిపించ‌దు. ఒక ఐకాన్ స్టార్ గురించి ప్ర‌స్థావిస్తే.. ఐకాన్ స్టార్ ఊరికినే అయిపోడు. బ‌న్ని ఆలోచ‌న‌లు కూడా అంత ఇదిగా ఉంటాయి. పిల్ల‌ల‌కు తెలుగు నేర్ప‌డాన్ని ఫ్యాష‌న్ గా భావించాడు బ‌న్ని... అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు గుణ‌శేఖ‌ర్.

అల్లు అర్హ పాత్ర తెర‌పై ఎలా క‌నిపిస్తుంది? అని ప్ర‌శ్నించ‌గా... చివ‌రి 15 నిమిషాలు అల్లు అర్హ ఇర‌గ‌దీసింద‌ని మీరంతా అది ఫిక్స్ అయిపోండ‌ని దిల్ రాజు అన్నారు. బ‌న్ని కిందికి దిగిపోయాడు! అనిపించేంత‌గా అర్హ న‌ట‌న‌తో మురిపించిందంటూ దిల్ రాజు ప్ర‌శంస‌లు కురిపించారు. శాకుంత‌లం చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.