Begin typing your search above and press return to search.

సాయి పల్లవిని ఎవరూ పెళ్ళి చేసుకోరట

By:  Tupaki Desk   |   17 July 2017 6:40 AM GMT
సాయి పల్లవిని ఎవరూ పెళ్ళి చేసుకోరట
X
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఫిదా చిత్రం ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో.. దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న ఈ మూవీతో.. హిట్ కొట్టడం చాలామందికి అవసరం. హీరోయిన్ సాయి పల్లవి ఈ చిత్రంతోనే తెలుగు అరంగేట్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ సాయి పల్లవి.. నిర్మాత దిల్ రాజు.. ఇలా ప్రధాన యూనిట్ అంతా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈసందర్భంగా సినిమా గురించి బోలెడన్ని సంగతులు కూడా చెబుతున్నారు. ముగ్గురూ కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో సాయి పల్లవి లాంటి అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోరని అనేసి షాక్ ఇచ్చేశారు దిల్ రాజు. ఇంతకీ ఆ మాట అనాల్సి వచ్చిన సందర్భం ఏంటంటే.. ఈ సినిమా చూసిన తర్వాత.. అందరూ వరుణ్ తేజ్ కు ఫిదా అయిపోతారని చెప్పింది సాయి పల్లవి. అదే మాటను కంటిన్యూ చేస్తూ.. నీలాంటి పాత్ర ఉన్న అమ్మాయిని మాత్రం ఎవరూ పెళ్లి చేసుకోరు అనేశారు దిల్ రాజు.

ఫిదా మూవీలో భానుమతి అనే పేరు గల పాత్రలో చేస్తున్న సాయి పల్లవి.. రెబల్ టైపు కేరక్టర్ చేస్తున్నా అని చెప్పింది. ప్రతీ లవ్ స్టోరీ ఎమోషనల్ టచ్ ఉన్న పాత్ర ఒకటి ఉంటుందని.. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్.. ఆర్యలో అల్లు అర్జున్ మాదిరిగా.. ఫిదాలో వరుణ్ తేజ్ పాత్ర ఎమోషన్స్ ను క్యారీ చేస్తుందని.. అదే సమయంలో సాయి పల్లవి రోల్ మాత్రం స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా దూసుకుపోయే వ్యక్తిత్వం ఉంటుందని చెప్పారు దిల్ రాజు.