Begin typing your search above and press return to search.
థియేటర్లో సినిమా ఎలా చూడాలో చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్
By: Tupaki Desk | 27 July 2021 5:30 AM GMTకరోనా దెబ్బకు మూతబడిన సినిమా థియేటర్లు ఈ శుక్రవారం నుంచి రీఓపెన్ కావటానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లను కాస్త ఆలస్యంగా తెరుస్తున్నారనే చెప్పాలి. మొదటి లాక్ డౌన్ సుదీర్ఘంగా సాగినప్పటికీ.. అన్ లాక్ షురూ అయిన కొద్ది రోజులకే ప్రభుత్వం ప్రకటన చేసినంతనే థియేటర్లు ఓపెన్ చేసిన తీరుకు భిన్నంగా.. సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు ఓపెన్ కాకపోవటం తెలిసిందే.
దీనికి కారణం.. తెలంగాణలో థియేటర్లు తెరుచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినా.. ఏపీలో థియేటర్లు మూసి ఉండటంతో సినిమాలు విడుదల చేయటానికి ఏ నిర్మాత కూడా సాహసించలేదు. కావాలంటే ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తామే తప్పించి.. థియేటర్ల విషయంలో మాత్రం కాస్త ఆలస్యంగానే విడుదల చేసేందుకు నిర్మాతలు .. ఎగ్జిబిటర్లు డిసైడ్ అయ్యారు.
ఈ శుక్రవారం పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నా.. రెండు సినిమాల మీదనే అందరి చూపు ఉందని చెప్పాలి. అందులో ఒకటి నాని నటించిన తిమ్మరసు కాగా.. రెండోది తేజా సజ్జా నటించిన ఇష్క్ మూవీగా చెప్పాలి. ఈ రెండు చిత్రాలు ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయనున్నాయి. తేజా సజ్జ కు ప్రియా వారియర్ జత కట్టిన ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సెలబ్రిటీ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద బాగా పడిందన్న దిల్ రాజు.. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు ఒక రిక్వెస్టు చేశారు. థియేటర్లలో సినిమాల్ని మాస్కు వేసుకొని మాత్రమే చూడాలని ఆయన కోరారు. ఇంతటి చక్కటి మాట చెప్పిన దిల్ రాజు.. ప్రెస్ మీట్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చే సమయంలో పక్కపక్కనే నిలుచున్నారే తప్పించి మాస్కులు పెట్టుకున్నది లేదు. ప్రెస్ మీట్ లోనూ మాస్కులు పెద్దగా పెట్టుకోలేదు. ప్రేక్షకులకు మంచి సలహా ఇచ్చిన దిల్ రాజు.. తనకు తానుగా కూడా ఆ సూచనను పాటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.