Begin typing your search above and press return to search.
2.0.. సంక్రాంతి వరకూ ఆడుతుందట!
By: Tupaki Desk | 1 Dec 2018 7:53 AM GMTఈ రోజుల్లో ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా.. వీకెండ్ తర్వాత వీక్ అయిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. అవి కూడా రెండు మూడు వారాలు మాత్రమే బాగా ఆడతాయి. ఆ తర్వాత జోరు తగ్గించేస్తాయి. ‘బాహుబలి’ లాంటి సినిమాలకు సైతం లాంగ్ రన్ లేదు. అలాంటిది మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ‘2.0’ సినిమా వచ్చే సంక్రాంతి వరకు ఆడుతుందని అంటున్నాడు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లలో ఒకడైన దిల్ రాజు. ‘2.0’ ప్రత్యేకమైన సినిమా అని.. జనాలు చాలా కాలం ఈ చిత్రాన్ని చూస్తారని.. కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని.. కాబట్టి ఈ చిత్రం జనవరిలో సంక్రాంతి పండగ వరకు ఆడుతూనే ఉంటుందని దిల్ రాజు జోస్యం చెప్పాడు.
ఐతే వీకెండ్లోనే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతోంది. త్రీడీలోనే చూడాలన్న ప్రచారం గట్టిగా జరగడంతో జనాలు త్రీడీ స్క్రీన్లనే ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో ఆ స్క్రీన్లు ఫుల్ అవుతున్నాయి. సాధారణ థియేటర్లు వెలవెలబోతున్నాయి. వీకెండ్ తర్వాత 2డీ స్క్రీన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి దిల్ రాజు చెప్పినట్లు సంక్రాంతి వరకు జనాలు ‘2.0’ను చూస్తూనే ఉంటారన్న మాట తమాషాగా అనిపిస్తోంది. మరోవైపు త్రీడీలోనే ‘2.0’ చూడాలన్న ప్రచారం చేటు చేసిన నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కు కూడా ప్రయత్నించాడు రాజు. తాను ఈ చిత్రాన్ని మూడుసార్లు చూశానని.. త్రీడీతో పాటు టూడీలోనూ సినిమా మంచి అనుభూతిని కలిగించిందని.. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ‘2.0’ను టూడీలోనే చూసి చాలా బాగుందని అన్నాడని దిల్ రాజు చెప్పడం విశేషం. మరి రాజు మాటల్ని నమ్మి జనాలు ‘2.0’ను టూడీలో కూడా చూస్తారంటారా?