Begin typing your search above and press return to search.
ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేస్తాం అంతే
By: Tupaki Desk | 8 Dec 2017 4:27 AM GMTమిడిల్ క్లాస్ కుర్రాడి ఎమోషన్స్ తో ఇంతకు ముందు చాలా సినిమాలొచ్చినా ఓ కొత్త యాంగిల్ తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యామంటున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. నేచురల్ స్టార్ నాని ఫిదా ఫేం సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఎంసీఏ సినిమా రిలీజుకు రెడీ అవుతోంది. సినిమా స్టార్ట్ చేసిన రోజునే డిసెంబర్ లోనే ఈ మూవీ రిలీజ్ చేస్తామని ప్రకటించామని... దానివెనుక ఓ ప్రత్యేకమైన రీజన్ ఉందని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
‘‘మా ప్రొడక్షన్ లో ఈ ఏడాది శతమానం భవతి.. నేను లోకల్.. దువ్వాడ జగన్నాథమ్.. ఫిదా.. రాజా ది గ్రేట్ సినిమాలు వచ్చాయని, ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఎంసీఏ హిట్టయితే డబుల్ హ్యాట్రిక్ సొంతమవుతుంది.‘‘మిడిల్ క్లాస్ కుర్రాళ్ల లైఫ్ లో అమ్మనాన్నలు.. అన్నదమ్ముల ఎమోషన్స్ తో సినిమాలు వచ్చాయి. మొదటిసారిగా వదినా మరుదుల మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. భూమిక వదిన క్యారెక్టర్ చేస్తోంది. దీంతోపాటు కథలో ఓ విలన్.. కమర్షియల్ యాంగిల్ కూడా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్ టెయిన్ చేస్తుందని నమ్ముతున్నా’’ అంటూ దిల్ చెప్పుకొచ్చారు.
‘‘మనకు కావాల్సిన మనిషి లైఫ్ లో మిస్సయినప్పుడు ఉండే బాధ నాకు తెలుసు. మన లైఫ్ లో కొత్త మనుషులు వచ్చినప్పుడో. మన లైఫ్ లో ఉన్న వ్యక్తులు మిస్సయినప్పుడో ఉండే ఫీలింగులే ఎంసీఏ సినిమాలో మెయిన్ గా కనపడతాయి. ఏమయినా ఇది సినిమా. మేము ఎన్నో అనుకోవచ్చు. మార్నింగ్ షో పడాలి. ప్రేక్షకులు చెప్పాలి. అదే నిజం. వాళ్ల నోటివెంట రానిది అబద్ధం’’ అని సినిమా ఎక్స్ పెక్టేషన్స్ గురించి దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.