Begin typing your search above and press return to search.

శతమానంపై అందుకే అంత నమ్మకమా?

By:  Tupaki Desk   |   31 Dec 2016 5:30 PM GMT
శతమానంపై అందుకే అంత నమ్మకమా?
X
శర్వానంద్ లేటెస్ట్ మూవీ శతమానం భవతి.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతోంది. చెప్పినట్లుగానే చెప్పిన డేట్ కే శతమానం విడుదలయిపోతోంది. ఖైదీ నంబర్ 150.. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నా సరే చిన్న సినిమా అయిన శతమానం భవతిని ఎంతో నమ్మకంగా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు.

ఇలా విడుదల చేయడానికి ఫ్యామిలీ కంటెంట్ కారణం అని ఇన్నాళ్లూ టాక్ వినిపించింది కానీ.. అసలు విషయం వేరట. శర్వానంద్ 25 వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని.. దిల్ రాజు చాలా జాగ్రత్తగా తెరకెక్కేలా జాగ్రత్త పడ్డాడట. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందినా.. ఈ మూవీ షూటింగ్ ను ఒక్క రోజు కూడా దిల్ రాజు మిస్ కాలేదని చెబుతున్నారు. సహజంగానే మేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజు.. శతమానం విషయంలో మరీ ఎక్కువగా అలర్ట్ గా ఉన్నాడని అంటున్నారు.

ఆల్మోస్ట్ గా శతమానం భవతి చిత్రానికి దిల్ రాజునే దర్శకుడు అనేసినా తప్పులేదని చెప్పుకుంటున్నారు. అందుకే ఎంతటి పోటీ ఉన్నా.. తన సినిమాపై నమ్మకంతో శర్వా సినిమాని రిలీజ్ చేస్తున్నాడట దిల్ రాజు. ఈ టాక్ నిజమే అయ్యి.. ఈ ఎటెంప్ట్ సక్సెస్ అయితే.. దిల్ రాజును డైరెక్టర్ గా చూసేయచ్చేమో!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/