Begin typing your search above and press return to search.

ఫిదా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   11 May 2018 4:45 AM GMT
ఫిదా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
X
టాలీవుడ్ లో మంచి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరని అందరికి తెలిసిందే. సినిమా తెరకెక్కుతోంది అంటే మినిమమ్ హిట్టవ్వాల్సిందే. దిల్ రాజు లాభం లేకుండా ప్రయోగాలు పెద్దగా చేయరు. డైరెక్షన్ తప్ప అన్ని విషయాలు కరెక్ట్ గా జడ్జ్ చేయగలరు. గత ఏడాది ఫిదా సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దిల్ రాజు ప్రొడక్షన్ ఆ తరువాత ఆ స్థాయిలో మరో భారీ విజయాన్ని అందుకోలేదు.

రాజా ది గ్రేట్ - నేను లోకల్ పరవాలేదు అనే విధంగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి గాని అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అందలేదు. ఇక ఇప్పుడు దిల్ రాజు ఫిదా స్టయిల్లో హిట్ అందుకోవాలని అప్పటి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం నితిన్ తో శ్రీనివాస కళ్యాణం అనే సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. శతమానం భవతి లాంటి సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అయితే గత ఏడాది జూన్ 21న రిలీజ్ అయినా ఫిదా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిందని ఈ ఏడాది కూడా అదే తేదీన శ్రీనివాస కళ్యాణంను రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు ప్లాన్ వేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. జూన్ ఎండింగ్ లో పూర్తిగా వర్క్ ను ఫినిష్ చేసి అనుకున్న సమయానికి విడుదల చెయ్యాలని చూస్తున్నాడు. మరి ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.