Begin typing your search above and press return to search.
అమ్మా మిస్సవుతున్నా! అగ్ర నిర్మాత కుమార్తె ఉద్వేగం!!
By: Tupaki Desk | 10 July 2020 10:46 AM ISTటాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత దివంగతురాలు అయిన సంగతి తెలిసిందే. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని కుమార్తె హన్షితా రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో హత్తుకునే పోస్ట్ ని షేర్ చేశారు. తన మాతృమూర్తి అనిత తనను హత్తుకుని దిగిన ఓ బాల్య జ్ఞాపకాన్ని (మెమరీ) ఈ సందర్భంగా షేర్ చేశారు. అమ్మతో తన ఆత్మీయతపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యని జోడించారు.
``పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా ... చాలా మిస్ అవుతున్నా.. ఎల్లప్పుడూ ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. కానీ కొన్ని రోజులు నేను నీతో ఎన్నో జ్ఞాపకాలు.. నేను ఎక్కువగా నీతో కలిసి ఫోటోలు దిగాను. నీ చిరునవ్వు దృశ్యాల చిత్రాలెన్నో. నీ దృష్టిలో ప్రేమ అంటే... ఎప్పటిలాగే నన్ను గట్టిగా కౌగిలించుకునే..`` అంటూ ఎమోషన్ అయ్యారు హన్సిత.
బాల్య జ్ఞాపకాన్ని ఇలా గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు హన్సిత రెడ్డి. ఇషు (తన కుమార్తె) రూపంలో తన తల్లి తిరిగి భూమ్మీదికి వచ్చారని కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తల్లి చిరునవ్వు.. ఆ కళ్లలోని ప్రేమ.. గట్టి కౌగిలింతలు వీటన్నిటినీ ఎంతో ఎమోషనల్ గా గుర్తు చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇషు (ఇషిక పూర్త పేరు) హన్షిత 6 నెలల కుమార్తె. ఇక తన తండ్రి దిల్ రాజు రెండో వివాహం చేసుకోవడానికి హన్షిత ప్రోద్భలం ఉందన్న సంగతి విధితమే. ఆయన తన దగ్గర బంధువుల్లోని ఎక్స్ ఎయిర్ హోస్టెస్ తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు.