Begin typing your search above and press return to search.
ఆ విషయంలో హీరోల్ని నిందించడానికేమీ లేదు!
By: Tupaki Desk | 23 April 2020 5:30 PM GMTకరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. ట్రేడ్ వర్గాలు లెక్కించించడానికి వీల్లేని రేంజ్ కి ఈ కరోనా నష్టం చేరింది. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజురోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ పీరియడ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదట 21 రోజులుగా ప్రకటించిన లాక్ డౌన్ ని వచ్చే నెల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే సమ్మర్ సీజన్ లో క్రేజీ మూవీస్ అన్నీ సందడి చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకులతో కళకళలాడే థియేటర్స్ నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు - మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో.. ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందో చెప్పలేని సిచ్యుయేషన్.
కరోనా ప్రభావం తగ్గి ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. పెద్ద సినిమాలు ఎలాగోలా తట్టుకుంటాయి కానీ.. చిన్న మీడియం రేంజ్ సినిమాల భవితవ్యమే అర్థం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమలో చాలా మార్పులకు కారణం కాబోతోందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్ లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. సినిమాల్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల చేసుకోవడానికి నిర్మాతలు సిద్ధమే... కానీ హీరోలే రెడీగా లేరట. దానికి కారణం ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పెట్టే కండిషన్స్ మన హీరోలకు నచ్చడం లేదని సమాచారం. ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తాము ప్రచారం కూడా చేయమని వాళ్లు మొండికేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరోలను వెనకేసుకు వస్తున్నాడు. హీరోల్ని నిందించడానికేమీ లేదని అంటున్నాడట.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాల విడుదలపై హీరోల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయన్న దాంట్లో నిజం లేదు. ఆర్నెల్ల కంటే ఎక్కువ రోజులు ఆగితే సినిమాలు పాతబడే ప్రమాదం కూడా ఉంది. అప్పటికి కూడా థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడేం చేస్తాం.. అందుకే హీరోలు కూడా వాళ్ల సినిమాలు ప్రేక్షకులకు చూపించడమే ముఖ్యం అనుకుంటారు. అది ఎక్కడన్నది ప్రధానం కాదు అని అన్నారట. అయితే సినిమాని థియేటర్లలో చూస్తే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. ఆ సౌండ్, విజువల్స్ థియేటర్లో గొప్ప అనుభూతినిస్తాయి. అందుకే మా 'వి' సినిమాని కొన్ని రోజులు వెయిట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడట. కాగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న 'వి' సినిమా ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉండగా.. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' కొంతమేర షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అయితే అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే మే నెలలో వకీల్ సాబ్ ని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోందట.