Begin typing your search above and press return to search.
కళ్యాణం అలసటతో గోవా కెళ్ళిన రాజుగారు!
By: Tupaki Desk | 13 Aug 2018 3:53 PM GMTస్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు జడ్జిమెంట్ పై చాలామందికి నమ్మకం ఉంది. కొంతమంది ఆడియన్స్ అయితే జస్ట్ అయన పేరు చూసి టికెట్ కొంటారు. ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. కానీ స్లోగా అయన ఇమేజ్ కూడా మసకబారుతోంది. రాజు గారు చెప్పినదానికి ఆయన సినిమాల్లో ఉన్న కంటెంట్ కి తేడా ఉండడంతో ప్రేక్షకులు ఆయనను లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు.
'శ్రీనివాస కళ్యాణం' అడ్వాన్సు బుకింగ్స్.. ఓపెనింగ్ కలెక్షన్సే దానికి సాక్ష్యం. సాక్ష్యం అంటే మళ్ళీ పంచ భూతాలూ గట్రా అంటూ లేనిపోనివి ఊహించుకోకండి. జస్ట్ ఉదహరణ అంతే. మౌత్ టాక్,రెస్పాన్స్ చూసిన రాజు గారు రిలీజ్ రోజు మధ్యాన్నం మూడు గంటలకు ఫ్లైట్ ఎక్కి గోవా కు వెళ్ళాడట. గోవాకు ఎందుకు వెళ్తారో మీకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆ స్టొరీ ఇక్కడ అప్రస్తుతం. యూత్ అంతా సినిమాను బోరింగ్ అంటుండడంతో ఇకపై ఫ్యామిలీ సినిమాలు తీయకూడదని కూడా ఫిక్స్ అయ్యాడట. ఇది రాజుగారే వెల్లడించారు. మరి అలానే నిరాశ లో ఉంటే అయన స్టార్ ప్రొడ్యూసర్ ఎందుకవుతాడు?
ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో అయనకు పెద్ద రిలీఫ్ వచ్చిందట. చాలామందినుండి ఆయనకు పెళ్లిని, సంప్రదాయాలను గొప్పగా చూపించినందుకు ప్రశంసలు లభించాయట. వాటివల్ల ఆయనకు ఇప్పుడు సంతృప్తిగా ఉందట. సినిమా ఎలాగూ లాస్ వెంచర్ అని ఇప్పటికే ట్రేడ్ వర్గాలలో అంచనాలున్నాయి. పోన్లెండి గుడ్డిలో మెల్ల అంటారుగా.. అలా రాజు గారికి ఎదో రూపంలో సంతృప్తి లభించింది!