Begin typing your search above and press return to search.

దిల్ రాజు సంక‌ట స్థితిలో ప‌డిపోయాడా?

By:  Tupaki Desk   |   2 Nov 2022 3:33 PM GMT
దిల్ రాజు సంక‌ట స్థితిలో ప‌డిపోయాడా?
X
టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ల‌లో ప్ర‌స్తుతం చ‌క్రం తిప్పుతున్న నిర్మాత దిల్ రాజు. ఇటీవ‌ల టాలీవుడ్ షూటింగ్ ల బంద్ స‌మ‌యంలో గిల్డ్ త‌రుపున ముందు నిల‌బ‌డిన దిల్ రాజు ఇండ‌స్ట్రీలో వున్న స‌మ‌స్య‌ల‌పై, నిర్మాత‌ల‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై వివిధ క్రాఫ్ట్ ల‌తో పాటు ఫెడ‌రేష‌న్ తోనూ చ‌ర్చ‌లు జ‌రప‌డం తెలిసిందే. ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో నిల‌బ‌డి యాక్టీవ్ గా వ్య‌వ‌హ‌రించిన దిల్ రాజు ఇప్ప‌డు గ‌తంలో తాను అన్న మాట‌ల కార‌ణంగా సంక‌టి స్థితిలో ప‌డిపోయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో షూటింగ్ ల బంద్ స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవితో స‌హా నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `ద‌స‌రా` షూటింగ్ కూడా మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న `వార‌సుడు` షూటింగ్ మాత్రం ఆగ‌లేదు. అదేమ‌ని మిగ‌తా నిర్మాత‌లు ప్ర‌శ్నిస్తే..త‌ను విజ‌య్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న `వార‌సుడు` డ‌బ్బింగ్ సినిమా అని, షూటింగ్ లు నిలిపి వేస్తున్న‌ది స్ట్రెయిట్ తెలుగు సినిమాల షూటింగ్ అని చెప్ప‌డం తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే దిల్ రాజుకు ఇబ్బందుల్ని సృష్టించ‌బోతోంద‌ని తెలుస్తోంది. గ‌తంలో త‌న‌ని నిల‌దీసిన నిర్మాత‌ల‌ని డ‌బ్బింగ్ సినిమా అని ద‌బాయించిన దిల్ రాజు ఇప్ప‌డు అదే సినిమాని సంక్రాతి బ‌రిలో తెలుగు సినిమాల‌కు పోటీగా నిలుపుతుండ‌టంతో ప్ర‌స్తుతం గిల్డ్ లో వున్న ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు ని నిల‌దీస్తున్నార‌ట‌.

గ‌తంలో డ‌బ్బింగ్ సినిమాలు పండ‌గ సీజ‌న్ ల‌లో తెలుగు సినిమాల‌కు పోటీగా రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని వాదించిన దిల్ రాజు ఇప్ప‌డు కొత్త‌గా తానే డ‌బ్బింగ్ సినిమాని సంక్రాంతి బ‌రిలో దించేయ‌డానికి రెడీ అవుతుండ‌టం ఇదేమీ బాగాలేద‌ని ఫైర్ అవుతున్నార‌ట‌.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో దిల్ రాజు స్టార్ హీరో విజ‌య్ తో చేస్తున్న `వార‌సుడు` మూవీని సంక్రాంతి బ‌రిలో నిలుపుతాడో లేక ఇత‌ర నిర్మాత‌ల ముందు అడ్డంగా బుక్క‌వ‌డం ఎందుక‌ని వెన‌క‌డుగు వేస్తాడో వేచి చూడాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దిల్ రాజు తెలుగు వెర్ష‌న్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గాల‌ని చూసినా హీరో విజ‌య్ మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ అందుకు అంగీక‌రించ‌డు. త‌మిళ వెర్ష‌న్ తో పాటే తెలుగు అనువాదం కూడా రిలీజ్ కావాల్సిందే. మ‌రి ఇలాంటి సంక‌ట స్థితి నుంచి దిల్ రాజు ఎలా సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ‌తాడో.. వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.