Begin typing your search above and press return to search.
శతమానం.. దిల్ రాజు పంట పండిందిగా
By: Tupaki Desk | 22 Jan 2017 4:51 AM GMTఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య వచ్చినా.. శతమానం భవతి మంచి హిట్ సాధించేసింది. గతేడాది ఎక్స్ ప్రెస్ రాజా మాదిరిగానే ఈ ఏడాది కూడా శతమానం భవతితో హిట్ కొట్టేసి.. సంక్రాంతి ఫ్యామిలీ హీరో అనిపించేసుకున్నాడు శర్వానంద్. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి 16.5 కోట్ల షేర్ వసూలు చేసేయడం సెన్సేషన్ అయిపోయింది.
శతమానం భవతికి అత్యధికంగా కలెక్షన్స్ వస్తున్న ఏరియాలు నైజాం.. ఉత్తరాంధ్ర ప్రాంతాలు. ఆశ్చర్యకరంగా ఈ రెండు ఏరియాల్లోనూ శర్వా సినిమాను స్వయంగా రిలీజ్ చేసుకున్నాడు దిల్ రాజు. నైజాంలో ఇప్పటివరకూ 4.85 కోట్ల షేర్ వసూలు కాగా.. వైజాగ్ ఏరియాలో 2.75 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ ఏరియాల్లో ఇంకా హౌస్ ఫుల్స్ పడుతుండడం.. కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో.. దిల్ రాజుకు మరిన్ని లాభాలను.. ఈ చిత్రం అందించడం ఖాయం అయిపోయింది.
తూర్పు గోదావరిలో కూడా 1.75 కోట్ల వసూళ్లు.. సీడెడ్ లో 1.6 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది శతమానం భవతి. మరోవైపు ఓవర్సీస్ ఫిగర్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నా.. మొత్తం మీద నైజాం.. ఉత్తరాంధ్రల ఈ చిత్రం ఎక్కువ వసూళ్లను రాబడుతుండడం.. ఈ ప్రాంతాల్లో దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేసుకోవడం.. ఈ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ తెలివితేటలకు నిదర్శనంగా చెప్పచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/