Begin typing your search above and press return to search.
రీమేక్ లతో దిల్ రాజు తల వాచిపోతుందా?
By: Tupaki Desk | 4 Feb 2020 5:10 AM GMTఒకసారి ఒక సినిమా తీయటమే కష్టమనే వేళ.. ఒకేసారి మూడు సినిమాలు చేయటం.. అవన్నీ రీమేక్ లు కావటం మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఫీట్ ను చేస్తున్నది మరెవరో కాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తమిళంలో సూపర్ సక్సెస్ అయిన 96ను జాను పేరుతో చేసిన సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిందీలో సక్సెస్ అయిన పింక్ ను.. తెలుగులో రీమేక్ చేయటమే కాదు.. ఎప్పటినుంచో పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలన్న కలను తీర్చుకుంటున్నారు దిల్ రాజు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే వెల్లడించారు కూడా. ఇదిలా ఉంటే.. తెలుగులో సక్సెస్ అయిన జెర్సీని హిందీలో.. అది కూడా షాహిద్ కపూర్ తో చేస్తున్నారు.
ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలు చేయటం.. అవన్నీ రీమేక్ లు కావటం ఒక విశేషమైతే..ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నిర్మాతగా తనకు మొదట్నించి స్టెయిట్ సినిమాలు చేయటం అలవాటన్నారు. రీమేక్ ల తలనొప్పులు బాగా తలకు పట్టేసినట్లు ఉన్నాయేమో.. దిల్ రాజు నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. స్టయిట్ సినిమాలు చేయటమే ఈజీ.. రీమేక్ లు చేయటం ఇబ్బందేనని చెప్పుకొచ్చారు. దిల్ రాజు లాంటి నిర్మాత నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.