Begin typing your search above and press return to search.

'స‌భ‌కు న‌మ‌స్కారం' పై దిల్ రాజు క్లారిటీ!

By:  Tupaki Desk   |   3 Aug 2018 2:00 PM IST
స‌భ‌కు న‌మ‌స్కారం పై దిల్ రాజు క్లారిటీ!
X
`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` డిజాస్ట‌ర్ కావ‌డంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిరుత్సాహ ప‌డ్డాడ‌ని....అందుకే నెక్స్ట్ ఓ మాస్ క‌మర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టించాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు ....ఓ ప‌క్కా మాస్ సబ్జెక్ట్ ను బ‌న్నీకి వినిపించార‌ని - ఆ క‌థ బన్నీకి నచ్చిందని టాక్ వ‌చ్చింది. అందేకాకుండా, ఆ చిత్రానికి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింద‌ని వార్తలు వెలువడ్డాయి. ముందుగా నానితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిద్ద‌మనుకున్న దిల్ రాజు....ఆ త‌ర్వాత బ‌న్నీని అప్రోచ్ అయ్యార‌ని టాక్ వ‌చ్చింది. ఈ చిత్రానికి ఇంకా డైరెక్టర్ ఫైనల్ కాలేద‌ని పుకార్లు వినిపించారు. ఈ నేప‌థ్యంలో ఆ గాసిప్స్ పై దిల్ రాజు స్పందించారు.

తాను నిర్మాతగా 'సభకు నమస్కారం' నిర్మించబోతున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను దిల్ రాజు ఖండించారు. బ‌న్నీతో సినిమాపై వ‌స్తోన్న వార్తలు అసత్యమని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. కొన్ని వెబ్ సైట్లలో - సోష‌ల్ మీడియాలో గ‌త రెండు రోజులుగా ఈ త‌ర‌హా వార్త‌లు స‌ర్క్యులేట్ అవుతున్నాయ‌ని - వాటిలో నిజం లేదని అన్నారు. ఇక‌నైనా....ఈ త‌ర‌హా గాసిప్స్ ను ఆపాల‌ని కోరారు. ప్రస్తుతం తాను నితిన్‌ తో 'శ్రీనివాస కళ్యాణం' చేశానని, మహేష్ బాబు 25వ చిత్రం ఒక్కటే సెట్స్ పై ఉందని తెలిపారు. తాను వేరే సినిమాను ఒప్పుకోలేద‌ని చెప్పారు. త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయిన‌ వెంటనే మీడియాకు తెలియజేస్తానని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు క్లారిటీతో `స‌భకు న‌మస్కారం`పై వ‌చ్చిన పుకార్ల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది.