Begin typing your search above and press return to search.

సాయి పల్లవికి ఏం తెలియదు..

By:  Tupaki Desk   |   19 Dec 2017 12:57 PM GMT
సాయి పల్లవికి ఏం తెలియదు..
X
హీరోయిన్స్ కి అవకాశాలు పెరిగిన కొద్దీ రూమర్స్ క్రియేట్ అవుతుండడం కామన్. అయితే నటి నటులు చాలా వరకు ఈ మధ్య కాలంలో టైమ్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు. అప్పట్లో పోటీ తక్కువ అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా రివర్స్. దీంతో ఇప్పుడు కొంత మంది తారలు చాలా క్రమశిక్షణతో ఉంటున్నారు. అయితే ఎలా ఉన్నా బయట ప్రపంచంలో రూమర్స్ బెడద మాత్రం తప్పదు.

ఇకపోతే గత కొంత కాలంగా ఫిదా బ్యూటీపై కూడా కొన్ని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. టైమ్ కి సరిగ్గా రాకపోవడం. కాల్షీట్స్ ఎగ్గొట్టడం వంటి పనులు చేసి చిత్ర యూనిట్ కి చీరకు తెప్పించిందని వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఆ వార్తలను ఖండించారు. రీసెంట్ గా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు.. సాయి పల్లవి చాలా మంచి అమ్మాయి అని.. టైమ్ ని చాలా కరెక్ట్ గా ఫాలో అవుతుందని చెప్పారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో సాయి ఎంసీఏ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ కి లెట్ గా వచ్చిందన్నా కామెంట్స్ పై దిల్ రాజు మాట్లాడుతూ.. ఒక టైమ్ చెబితే కరెక్ట్ సమయానికి సాయి పల్లవి వస్తుంది. ఇక కాల్షీట్స్ విషయంలో మాత్రం కొంచెం తేడా వచ్చిన సంగతి నిజమే. కానీ తనకీ డేట్స్ కుదరకపోవడం వల్ల అలా జరిగింది. అయినా ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ సమయాన్ని కేటాయించిందని చెప్పారు. ఇక శ్రీనివాస్ కళ్యాణం సినిమాకు ఆమె నో చప్పిందన్న వార్త కూడా పూర్తిగా అవాస్తవమని అసలు ఆ సినిమా కథ గురించి సాయి పల్లవికి కొంచెం కూడా తెలియదని దిల్ రాజు తెలియజేశారు.