Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు 'అఖండ' నమ్మకం ఏంటో!

By:  Tupaki Desk   |   17 Oct 2021 9:30 AM GMT
దిల్ రాజుకు అఖండ నమ్మకం ఏంటో!
X
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కనుక ఈ సినిమా ఖచ్చితంగా బాలయ్య మరియు బోయపాటి కాంబోకు హ్యాట్రిక్ గా నిలుస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ను అతి త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత అఖండ విడుదల చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా భారీ ఎత్తున బిజినెస్ చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో అఖండ సినిమా ను టైటిల్ కు తగ్గట్లుగానే భారీ మొత్తంతో కొనుగోలు చేశారనే టాక్ వినిపిస్తుంది.

అఖండ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది మొదలు అంచనాలు.. ఆసక్తి పెరుగుతూనే ఉంది. పైగా సినిమా లోని బాలయ్య రెండు గెటప్ లు కూడా సినిమా స్థాయిని అమాతం పెంచేసింది. కనుక ఖచ్చితంగా సినిమా రికార్డు బ్రేకింగ్‌ లో వసూళ్లను దక్కించుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌ లో అఖండ సినిమా బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ ను మాత్రమే కాకుండా లాంగ్ రన్‌ లో కూడా బిగ్గెస్ట్‌ వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటూ ధీమాగా ఉన్నారు. అందుకే ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్ ను భారీ మొత్తంకు గాను దిల్ రాజు కొనుగోలు చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆయన అఖండ కోసం కాస్త అటు ఇటుగా 20 కోట్ల వరకు పెట్టాడని అంటున్నారు. నైజాం ఏరియాలో బాలయ్య సినిమాకు ఆ రేంజ్ లో బిజినెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆంద్రా సీడెడ్‌ లో ఉన్నంత క్రేజ్ బాలయ్యకు నైజాం లో ఉండదు అనేది ట్రేడ్‌ టాక్‌. అయినా కూడా అఖండ నైజాం ఏరియాలో 20 కోట్ల రూపాయలు పలకడం అంటే రికార్డుగానే చెప్పుకోవాలి.

బాలకృష్ణ మరియు బోయపాటిలు ఇప్పటికే అఖండ సినిమాను ముగించారు. కాని విడుదల కోసం మంచి తేదీని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వరుసగా కరోనా ఇతర్రత కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఈ సమయంలోనే ఏపీలో థియేటర్లలో టికెట్ల రేట్ల విషయంలో కాస్త చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ విషయమై ఒక స్పష్టత వస్తే అఖండ ను విడుదల చేసే విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. అఖండ సినిమాను దీపావళి కానుకగా అనుకున్నారు. కాని ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అఖండ విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.