Begin typing your search above and press return to search.

మెగా హీరోలతో హ్యాట్రిక్ బంధం

By:  Tupaki Desk   |   4 Dec 2015 11:42 AM GMT
మెగా హీరోలతో హ్యాట్రిక్ బంధం
X
ట్యాలెంటెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఓ అలవాటు ఉంది. ఎవరైనా డైరెక్టర్ నచ్చితే.. వాళ్లతో వరుసగా ఓ మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసేసుకునే అలవాటు ఉంది. మొదటి సినిమా హిట్ కొడితే ఓకే.. అంతా బాగానే ఉంటుంది. టైం బ్యాడ్ అయ్యి ఫ్లాప్ అయితే మాత్రం.. వాళ్లు ఏళ్లకేళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దిల్ రాజు ఇదే మూడు సినిమాల స్ట్రాటజీని మెగా హీరోలకు కూడా అప్లై చేసేస్తున్నాడు. ఇప్పటికే సాయిధరం తేజతో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ను నిర్మించిన ఈ నిర్మాత.. ప్రస్తుతం సుప్రీమ్ ను తెరకెక్కిస్తున్నాడు.

మరో మెగా హీరో నాగబాబు తనయడు అయిన వరుణ్ తేజ్ తో కూడా సేమ్ ప్లాన్ వర్కవుట్ చేసేస్తున్నాడు రాజు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో రెండు సినిమాలను ఏకకాలంలో నిర్మించబోతున్నాడు. ఫీల్ మై లవ్ టైటిట్ తో స్టార్ట్ చేయనున్న ఓ ప్రాజెక్టుతో పాటు.. క్రిష్ దర్శకత్వంలో రాయబారిని కూడా నిర్మించనుండడం విశేషం. ఇంతకీ మెగా హీరోలతో ఇలా వరుసగా సినిమాలు చేయడానికి కారణమేంటో అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. నిజానికి మెగా ఫ్యామిలీ సినిమాలను బిజినెస్ చేసుకోవడం తేలిక. ఎలాగూ నైజాంలో తనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు. మిగిలిన ఏరియాల్లోనూ మంచి ఆఫర్స్ వచ్చేస్తుంటాయి. దాదాపు టేబుల్ ప్రాఫిట్ తోనే బిజినెస్ క్లోజ్ చేయచ్చనేదే అసలు ఐడియా అంటారు.

మరోవైపు కుర్ర హీరోల విషయంలో మెగా క్యాంప్ చాలా అలర్ట్ గా ఉంటోంది. ఒక్కో సినిమాకు రేంజ్ పెరిగేలా జాగ్రత్త పడుతోంది. దీంతో రెండు వైపులా లాభం ఉన్న ఈ డీల్ కు దిల్ రాజు బాగానే అట్రాక్ట్ అవుతున్నట్లు చెప్పుకోవచ్చు.