Begin typing your search above and press return to search.
దిల్ రాజుకు నందమూరి సెంటిమెంటు
By: Tupaki Desk | 30 Dec 2015 1:30 PM GMTనిర్మాతగా కొనసాగుతూనే డిస్ట్రిబ్యూషన్ లోనూ ఓ చేయి వేస్తూనే ఉంటాడు దిల్ రాజు. సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ తెలివిగా పెట్టుబడులు పెట్టడంలో దిల్ రాజు ప్రత్యేకతే వేరు. ఈ ఏడాది పటాస్ - బాహుబలి - సినిమా చూపిస్త మావ - కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలు రాజుకు మాంచి లాభాలే మిగిల్చాయి. మధ్య మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఓవరాల్ గా మంచి ఫలితాలే అందుకున్నాడు రాజు. ఈ ఏడాది నందమూరి కుటుంబ కథానాయకుడు కళ్యాణ్ రామ్ సినిమా ‘పటాస్’తో ఆయన శుభారంభం చేశాడు. ఇక వచ్చే ఏడాది కూడా సెంటిమెంటుగా నందమూరి హీరో సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ మొదలుపెడుతున్నాడు రాజు.
సంక్రాంతికి రాబోతున్న బాలయ్య సినిమా ‘డిక్టేటర్’ నైజాం రైట్స్ రాజునే తీసుకున్నట్లు సమాచారం. బాలయ్య సినిమాల్లో రికార్డు ప్రైస్ ఇచ్చి రాజు హక్కులు తీసుకున్నాడట. ఐతే సంక్రాంతికే రాబోతున్న మరో నందమూరి హీరో ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ నైజాం రైట్స్ తీసుకోవడానికి కూడా రాజు ప్రయత్నం చేశాడు. ఐతే అభిషేక్ పిక్చర్స్ సంస్థ రాజు చెప్పిన రేటు కంటే చాలా ఎక్కువగా.. అంటే దాదాపు రూ.15 కోట్లిచ్చి ఆ సినిమాను కొనేసింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా బాలయ్య సినిమాను తీసుకుని.. నందమూరి సెంటిమెంటుకు ఢోకా లేకుండా చూసుకున్నాడు రాజు. మరి ఆయన సెంటిమెంటు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. 13న ‘నాన్నకు ప్రేమతో’ రాబోతుండగా.. మరుసటి రోజు ‘డిక్టేటర్’ విడుదలయ్యే అవకాశాలున్నాయి.