Begin typing your search above and press return to search.

ఆ రెండు కోట్ల భారం నిత్యాపైనే

By:  Tupaki Desk   |   12 April 2015 6:48 AM GMT
ఆ రెండు కోట్ల భారం నిత్యాపైనే
X
ఒక కొత్త హీరో సినిమాని తెలుగులో ఆడించాలంటే గట్స్‌ ఉండాలి. స్టార్‌డమ్‌ లేని హీరోలకు అంత గిరాకీ లేదు. తొలివారం ఆడేవరకూ థియేటర్‌లో సినిమా ఉంటుందా అంటే డౌటే. అయితే ఆ నలుగురిలో ఒక్కడు కాబట్టి దిల్‌రాజు భయపడాల్సిన పనిలేదు. థియేటర్‌లో ప్రేక్షకుడు ఉన్నా లేకపోయనా తొలివారం అయితే గ్యారెంటీగా వేసుకునే వెసులుబాటు ఉంటుంది.

అందుకే దాదాపు రూ.4కోట్లు వెచ్చించి మరీ 'ఒకే బంగారం' తెలుగు రిలీజ్‌ హక్కుల్ని చేజిక్కించుకున్నారాయన. సినిమా హిట్టు అంటే శాటిలైట్‌ రూపంలోనే ఆ మొత్తం వచ్చేస్తుంది. అదే ఫట్టు అంటే ఫలితం వేరేగా ఉంటుంది. దర్శకుడు మణిరత్నం ట్రాక్‌ రికార్డ్‌ అసలే బాలేదు. అయినా ఒకే బంగారం చిత్రానికి తమిళ ట్రేడ్‌లో మంచి క్రేజు వచ్చింది. సినిమా బావుంది అన్న టాక్‌ ముందే ప్రచారమైంది. ఒకవేళ రిలీజ్‌కి ముందే ఈ సినిమా శాటిలైట్‌ని తన పరిచయాలు, ఇమేజ్‌ ఉపయోగించి అమ్మేస్తే కనీసం 2కోట్లు గ్యారెంటీ. అయితే మిగిలిన 2 లేదా 3 (ప్రచారం ఖర్చు అదనం కదా!) కోట్లు థియేటర్ల నుంచి రప్పించడం ఎలా?

అంటే హీరోని చూసి అయితే జనాలు థియేటర్లకు రారు. ఒకటి సినిమాలో కంటెంటే సక్సెస్‌ని ఇవ్వాలి. ఈ సినిమాకి సంబంధించినంతవరకూ ప్లస్‌ ఏదైనా ఉంది అంటే అది బుల్లి సౌందర్య నిత్యామీనన్‌. తనని చూడడం కోసమే థియేటర్లకు వచ్చే వీరాభిమానులుంటారు. అందువల్ల ఒకే బంగారం డబ్బు పరంగా ఓకే అనిపించినా ఓకే. ఆ రెండు కోట్ల వసూళ్లు నిత్యాపైనే డిపెండ్‌ అయి ఉందన్నమాట!