Begin typing your search above and press return to search.

'మహర్షి' పై దిల్‌ రాజు నమ్మకం చూస్తే ఆశ్చర్యంగా ఉంది

By:  Tupaki Desk   |   5 May 2019 1:30 AM GMT
మహర్షి పై దిల్‌ రాజు నమ్మకం చూస్తే ఆశ్చర్యంగా ఉంది
X
ప్రతి నిర్మాత కూడా తాను నిర్మించిన సినిమా విడుదలకు ముందు హిట్‌ అవుతుందని, తనకు లాభాలు తెచ్చి పెడుతుందని నమ్ముతాడు. అయితే ఆ నమ్మకంతో పూర్తి స్వేచ్చగా మాత్రం ఉండలేడు. సినిమా పూర్తి అయ్యింది విడుదల కాబోతుంది తాను అనుకున్నట్లుగా వచ్చిందా రాలేదా, ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారా లేదా అనే అనుమానం మాత్రం ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటుంది. నిర్మాతలు చివరి క్షణం వరకు సినిమా విషయంలో జాగ్రత్తలు పడుతూనే ఉన్నారు. ఈమద్య కాలంలో నిర్మాతలు ఎక్కువ నిడివి ఉన్న సినిమాలపై జాగ్రత్త పడుతున్నారు. రెండు లేదా రెండున్నర గంటలకు మించి రన్‌ టైం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మహర్షి విషయంలో మాత్రం దిల్‌ రాజు కు ఏ కోశాన అపనమ్మకం ఉన్నట్లుగా అనిపించడం లేదు.

తాజాగా 'మహర్షి' చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకు యూ/ఎ సర్టిఫికెట్‌ దక్కింది. సెన్సార్‌ పూర్తి అవ్వడంతో ఈ చిత్రం రన్‌ టైం లాక్‌ అయ్యింది. 178 నిమిషాల నిడివితో ఈ చిత్రం రాబోతుంది. అంటే దాదాపుగా మూడు గంటలు. గత ఏడాది మహానటి మరియు రంగస్థలం చిత్రాలు మాత్రమే ఈ స్థాయి నిడివితో వచ్చాయి. మరికొన్ని వచ్చినా అవి ఫ్లాప్‌ అయ్యాయి. కాని రంగస్థలం మరియు మహానటి చిత్రాలు మాత్రం నిడివితో సంబంధం లేకుండా సూపర్‌ హిట్‌ అయ్యాయి. అద్బుతమైన కంటెంట్‌ ఉందనుకున్న సమయంలో నిడివి గురించి ఆలోచించాల్సిన పని లేదని నిర్మాత దిల్‌ రాజు అభిప్రాయం. అందుకే మహర్షి చిత్రం నిడివి ఎక్కువ అయినా పర్వాలేదు, సినిమా ఏమాత్రం నిరుత్సాహ పర్చకుండా, బోర్‌ కొట్టకుండా ఉంటుందని సన్నిహితులతో చెబుతున్నాడు.

'మహర్షి' చిత్రం చివరి 45 నిమిషాలు అద్బుతమైన సెంటిమెంట్‌ మరియు యాక్షన్‌ సీన్స్‌ తో సాగుతుందని, ప్రేక్షకుల హృదయాలు ద్రవింపజేసేలా క్లైమాక్స్‌ ఉంటుందని ఇటీవలే సన్నిహితల వద్ద దిల్‌ రాజు చెప్పుకొచ్చాడట. దర్శకుడు వంశీ పైడిపల్లి పై పూర్తి నమ్మకంతో సింగిల్‌ కట్‌ కూడా చెప్పకుండా దిల్‌ రాజు ఈ చిత్రంను మూడు గంటల నిడివితో విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు. దిల్‌ రాజు కు ఈ చిత్రంపై ఉన్న నమ్మకంను చూసి సినీ వర్గాల వారు కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నమ్మకం చూస్తుంటే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అనిపిస్తుందని అంటున్నారు. ఈనెల 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం మహేష్‌ బాబు కెరీర్‌ లో నిలిచి పోవడమే కాకుండా నాన్‌ బాహుబలి రికార్డులను కూడా దక్కించుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.