Begin typing your search above and press return to search.
‘అఆ’..దిల్ రాజుకు పిచ్చపిచ్చగా నచ్చేసిందట
By: Tupaki Desk | 31 May 2016 9:30 AM GMTదిల్ రాజుకు నచ్చితే ఆ సినిమా సూపర్ హిట్టే అన్నది టాలీవుడ్లో ఉన్న ఓ నమ్మకం. రాజుజడ్జిమెంట్ కూడా కొన్నిసార్లు తిరగబడ్డప్పటికీ.. ఆయనకు ఇప్పటికీ క్రెడిబిలిటీ ఉంది. దిల్ రాజుకు సినిమా నచ్చడం అన్నది ఓ సర్టిఫికెట్ లాగా భావిస్తారు నిర్మాతలు. మా సినిమా రాజుకు నచ్చింది.. ఆయనే రిలీజ్ చేయబోతున్నాడు అని ప్రమోషన్లతో ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ‘అ..ఆ’ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ అదే మాట అంటున్నాడు. తన సినిమా తనకు చాలా బాగా నచ్చిందని.. ఇక తీర్పు ప్రేక్షకుల చేతిలోనే ఉందని అన్న ఆయన.. ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా చూసి కాంప్లిమెంట్ ఇచ్చారా అని అడిగితే.. ‘‘దిల్ రాజు గారు సినిమా చూశారు. ఆయనకు విపరీతంగా నచ్చేసింది. నైజాం ఏరియాలో ఆయనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు’’ అని చెప్పాడు.
ఇంకా ‘అ..ఆ’ విశేషాల గురించి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇంతకు ముందు త్రివిక్రమ్ తో చేసినవి ఆయన మార్కు కమర్షియల్ సినిమాలు. ఐతే ‘అ..ఆ’ త్రివిక్రమ్ మనసు పెట్టి చేసిన.. తెరపై భావుకత చూపించిన ఓ వెరైటీ ప్రయత్నం. రెగ్యులర్ సినిమాలకు పెట్టుకునే రూల్స్.. కండిషన్స్.. అన్నీ పక్కన పెట్టి ఓ మంచి సినిమా చేద్దామని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆ మాట నాకెంతో నచ్చి ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాను. నేను మామూలుగా నా సినిమాల్ని విడుదలకు ముందు పూర్తిగా చూడను. అక్కడక్కడా కొంచెం కొంచెం ముక్కలు ముక్కలుగా చూస్తుంటా. కానీ ‘అ..ఆ’ మాత్రం పూర్తిగా చూశాను. నాకు బాగా నచ్చింది. జనాలు ఏమంటారో చూడాలి. సినిమాలో ప్రథమార్ధం అంతా సరదాగా సాగిపోతుంది. హాయిగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఎమోషన్లు పండుతాయి. క్లైమాక్స్ గుండెకు తాకుతుంది. సెన్సార్ వాళ్లు కూడా మంచి ఫీల్ గుడ్ సినిమా తీశామని కాంప్లిమెంట్ ఇచ్చారు’’ అని చెప్పారు.