Begin typing your search above and press return to search.
దిల్ రాజుకు పెద్ద చిక్కొచ్చి పడిందే..
By: Tupaki Desk | 11 March 2020 3:44 AM GMTటాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు కొత్త ఏడాదిలో మంచి ఆరంభమే లభించింది. సంక్రాంతికి వచ్చిన ఆయన సినిమా సరిలేరు నీకెవ్వరు మంచి ఫలితాన్నే అందుకుంది. అల వైకుంఠపురములో సినిమాను నైజాంలో పంపిణీ చేసి దాని ద్వారానూ మంచి లాభాలందుకున్నారు. కానీ తర్వాతి నెలలో ఆయనకు పెద్ద పంచ్ పడింది. ఆయన ఎంతో ఇష్టపడి రీమేక్ చేసిన జాను సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దీనిపై పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది.
ఐతే మార్చిలో తన సంస్థ నుంచి రాబోతున్న వి సినిమాతో నష్టాలు భర్తీ చేసుకుందామని అనుకుంటే.. ఈ సినిమాకు కష్టకాలం తప్పేలా లేదు. నాని, సుధీర్ బాబు కీలక పాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయాలా వద్దా అన్న డైలమాలో రాజు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు గడ్డు కాలం నడుస్తోంది. మినిమం కలెక్షన్లు కూడా లేవు. హైదరాబాద్ లాంటి చోట్ల జనాలు థియేటర్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. మున్ముందు పరిస్థితులు ఇంకా ఇబ్బందికరం గా మారేలా ఉన్నాయి. జనాలు ఇప్పుడిప్పుడే థియేటర్లకు వెళ్లే మూడ్‌లోకి వచ్చేలా లేరు. భీష్మ లాంటి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా.. పరిమితం వసూళ్లతో సర్దుకుపోవడం చూసి ఈ సంకట స్థితిలో వి సినిమాను రిలీజ్ చేస్తే ఆశించిన ఫలితం దక్కదేమో అని రాజు కంగారు పడుతున్నాడట. ఐతే ఏప్రిల్ ఆరంభం నుంచి వారానికి రెండు మూడు చొప్పున సినిమాలు షెడ్యూల్ అయిన నేపథ్యంలో వి మూవీని వాయిదా వేస్తే డేట్ దొరకడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో రాజు అయోమయంలో పడ్డట్లు సమాచారం.