Begin typing your search above and press return to search.
కార్తికేయ విలన్ రోల్స్ కూడా చేస్తుండాలి
By: Tupaki Desk | 7 Nov 2021 4:36 AM GMTదిల్ రాజు ఎంతోమంది దర్శకులను .. హీరోలను పరిచయం చేశారు. అలాగే ఆయా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వెళ్లి, యంగ్ హీరోలకు కావలసిన సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. నిన్న రాత్రి జరిగిన 'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "ఇప్పుడు కొత్త హీరోలంతా కొత్తగా కొత్తగా ఆలోచిస్తూ వస్తున్నారు. కార్తికేయ .. కిరణ్ అబ్బవరం .. సుధాకర్ .. ఇలా చాలామంది వస్తున్నారు.
నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాతో చాలామంది అనేవారు 'నీకు బ్యాక్ గ్రౌండ్ లేదుగదా ఎలా'? అని. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి బ్యాక్ గ్రౌండ్ ఉండవలసిన అవసరం లేదు .. టాలెంట్ ఉంటే ఆటోమేటిగ్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ హీరోలు కూడా అదే ప్రూవ్ చేస్తున్నారు. ఒక అపోహ ఉంది .. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతమందే సక్సెస్ అవుతారని. ఇక్కడ అలాంటిదేం ఉండదు. కార్తికేయ ఫస్టు సినిమా ఆడకపోయినా .. సెకండ్ సినిమా 'ఆర్ ఎక్స్ 100' హిట్ అయింది.
ఆ సినిమా టీజర్ ను వాళ్ల బాబాయి నాకు చూపించాడు. అప్పుడే చెప్పాను నేను .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని. 'ఆర్ ఎక్స్ 100' తో హిట్ కొట్టిన కార్తికేయ, ఈ రోజున విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. కార్తికేయకు చెబుతున్నాను .. ఆయన కేవలం హీరోగా మాత్రమే చేయాలని ఫిక్స్ కావొద్దు. ఆయన ఒక్కో అవకాశాన్ని వాడుకుంటూ వెళ్లాలి .. అప్పుడే లాంగ్ రన్ ఉంటుంది. హీరోగా ఎప్పటివరకూ ఉండగలుతారనేది వాళ్లు ఎంచుకునే కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువమంది హీరోలు ఉన్నారు. ఇండియాలోనే మరే ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు లేరు. ఒకందుకు ఇది గర్వంగా చెప్పుకోవలసిన విషయమే. యంగ్ జనరేషన్ అన్నిరకాల పాత్రలను చేయడానికి సిద్ధమై వెళ్లాలి. కిరణ్ అబ్బవరం హీరోగా అండర్ ప్రొడక్షన్లో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆయనకి కూడా నేను ఇదేమాట చెబుతున్నాను. కథలు సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చేస్తున్న ఫైట్ డెఫినెట్ గా అభినందనీయం .. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ట్రైలర్ చూశాను .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ట్రైలర్ చూడగానే కార్తికేయ కు కాల్ చేసి చెప్పాను. తను సీరియస్ పాత్రలే కాదు, మంచి హ్యూమరస్ పాత్రలు కూడా చేయగలడని ఈ ట్రైలర్ ద్వారా అర్థమైంది. ట్రైలర్ మాదిరిగానే సినిమా ఉండాలని ఆశిస్తున్నాను. ఇండియా మొత్తం నిన్న 'సూర్యవంశి' రిలీజ్ అయింది. అలాగే రజనీకాంత్ గారి సినిమా కూడా రిలీజ్ అయింది. అందరూ కూడా థియేటర్స్ కి వస్తుండటంతో సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అలాగే నవంబర్ 12న విడుదలవుతున్న సినిమాలు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.