Begin typing your search above and press return to search.

నానీ నమ్మకమే ఈ సినిమా

By:  Tupaki Desk   |   15 Dec 2021 3:11 AM GMT
నానీ నమ్మకమే ఈ సినిమా
X
నానీకి అన్ని వర్గాల ప్రేక్షకులలోను మంచి ఇమేజ్ ఉంది. అయితే కరోనా కారణంగా .. ఆ తరువాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆయన సినిమాలు 'వి' .. 'టక్ జగదీష్' అమెజాన్ ప్రైమ్ ద్వారా అభిమానులను పలకరించాయి. కొంత గ్యాప్ తరువాత ఆయన నుంచి థియేటర్ కి వస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ నెల 24న వస్తున్న ఈ సినిమా, నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరువుకుంది. ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ .. " ఇక్కడి ఈవెంట్ ను చూడగానే మా 'ఎమ్ సి ఎ' సినిమానే గుర్తుకు వస్తోంది. ఏవండోయ్ నానిగారూ .. ఏవండోయ్ చిన్నిగారు .. ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. అలాగే 'ఉప్పెన' బేబమ్మ ఇక్కడే ఉంది.

ముందుగా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవలసింది .. సిరివెన్నెల సినిమాతో మొదలై .. దానిని ఇంటి పేరుగా మార్చుకున్న సీతారామశాస్త్రిగారిని. వారికి ముందే తెలిసిందేమో భగవంతుడి దగ్గరికి వెళ్లిపోతున్నానని .. చివరి పాటలో సిరివెన్నెల అని పెట్టి .. ఒక పాట రాసి .. మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. "సార్ మీరు పైన ఉన్నారు .. చూస్తున్నారు. మీ పాటను ఈ సినిమా ఈవెంట్ లో మేమంతా గుర్తుచేసుకుంటున్నాము". ఇక 'శ్యామ్ సింగ రాయ్' విషయానికి వస్తే, నా మిత్రుడు బోయనపల్లి వెంకట్ గారి మొదటి సినిమా ఇది. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.

సార్ నాకు గుర్తుంది .. 'ఒక హిట్టు సినిమా తీయాలి .. ఎలా తీయాలి?' అని నన్ను అడిగారు ఆఫీసులో. మీకు ఈ రోజున నాని దొరికాడు .. ఒక హిట్టు సినిమా తీసి మీ చేతిలో పెట్టడానికి. ఈ సినిమా దర్శక నిర్మాతలు కొత్తవాళ్లైనా నాని ఈ సినిమాను తన భుజాలపై పెట్టుకుని ఈ క్రిస్మస్ కి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా ఎదిగారు. సినిమాకి .. సినిమాకి ఎదుగుతున్న నానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆగకూడదు ఇలాగే కంటిన్యూ అవ్వాలి .. అవుతావు కూడా.

నానీ నీ నమ్మకమే ఈ సినిమా .. అది నాకు తెలుసు .. అందరికీ తెలుసు. నీ నమ్మకం నిజం కావాలి ఈ నెల 24న. ట్రైలర్ చూస్తుంటేనే సూపర్ హిట్ కొడతావనిపిస్తోంది. ఇక స్పెషల్ పీస్ .. మా 'ఫిదా' హీరోయిన్ సాయిపల్లవి. ఆమె గురించి ఏం చెబుతాం .. వెరీ గుడ్ ఆర్టిస్ట్ .. వెరీగుడ్ డాన్సర్ .. వెరీగుడ్ పెర్ఫార్మర్. 'ఎమ్ సి ఎ' తరువాత మళ్లీ ఆ మేజిక్ రిపీట్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక ఫస్టు సినిమాతోనే హిట్ కొట్టిన బేబమ్మ .. సెకండ్ సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తోంది.

అసలు ఈ రోజు ఇక్కడ ఈవెంట్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా? మా అన్న ఎర్రబెల్లి దయాకర్ గారు. అన్నా ఇలా మేము వద్దామని అనుకుంటున్నామంటే .. "వచ్చేయండి .. ఏం కావాలో మేము అరెంజ్ చేస్తాము" అన్నారు. సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ తరువాత వరంగల్ ను ప్యారలల్ సిటీగా చేసేశారు. అందుకు మేమంతా థ్యాంక్స్ చెబుతున్నాము. 'ఎమ్ సి ఎ' ఈవెంట్ ఇక్కడే చేశాము .. ఆ సెంటిమెంట్ తో ఇక్కడే ఈవెంట్ చేద్దామని మా ప్రొడ్యూసర్ గారు అడిగారు. ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.