Begin typing your search above and press return to search.
దిల్ రాజు సినిమాలు చూడట్లేదా?
By: Tupaki Desk | 17 Jan 2018 5:25 PM GMTదిల్ రాజు నిర్మాతగా ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా డిస్ట్రిబ్యూషన్ మాత్రం వదులుకోలేదు. ఓవైపు వరుసబెట్టి సినిమాలు నిర్మిస్తూనే.. సినిమాల పంపిణీని కొనసాగిస్తున్నాడు. గత ఏడాది అరడజను సినిమాలు వచ్చాయి దిల్ రాజు బేనర్ నుంచి. డిస్ట్రిబ్యూటర్‌గా అంతకు రెట్టింపు స్థాయిలో సినిమాలు పంపిణీ చేశాడు. ఆయన నిర్మించిన సినిమాలు చాలా వరకు మంచి ఫలితాలే అందించాయి. కానీ పంపిణీ చేసిన సినిమాల్లో కొన్ని ఆయనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘స్పైడర్’ - ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాల గురించే. ఆ సినిమాలపై పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదు రాజుకు. ‘జై లవకుశ’తో పాటు ఇంకొన్ని సినిమాలు కూడా నష్టాలే తెచ్చిపెట్టాయి.
ఐతే తన సినిమాలైతే అన్నీ దగ్గరుండి చూసుకుంటానని.. వేరే సినిమాలు కొన్నప్పుడు అన్నీ తన చేతుల్లో ఉండవని.. కాబట్టి కొత్త ఏడాదిలో డిస్ట్రిబ్యూషన్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని కొన్ని రోజుల కిందట అన్నాడు రాజు. కానీ ఈ ఏడాది ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా ఊహించని ఎదురు దెబ్బ తిన్నారు. ఇప్పటిదాకా కెరీర్లో ఏ సినిమాకూ రానంత నష్టాన్ని ‘అజ్ఞాతవాసి’ వల్ల ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సినిమాపై రూ.27 కోట్ల పెట్టుబడి పెడితే ఇప్పటిదాకా రూ.10 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మహా అయితే ఇంకో రెండు మూడు కోట్లు రావొచ్చేమో. అంటే 14-15 కోట్ల దాకా నష్టమన్నమాట. ఇది రాజుకు కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఐతే చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కాంబినేషన్ క్రేజ్ చూసుకుని ఎంత పడితే అంతకు సినిమా కొని మునిగిపోతుంటారు. కానీ రాజు కేవలం డిస్ట్రిబ్యూటర్ కాదు. స్వయంగా పెద్ద నిర్మాత. ‘స్పైడర్’.. ‘అజ్ఞాతవాసి’ సినిమాల్ని ఆయన సైతం కాంబినేషన్ క్రేజ్ చూసే అంతేసి రేట్లకు కొన్నాడన్నది స్పష్టం. దిల్ రాజు స్థాయి నిర్మాత అవసరమైతే సినిమా చూసుకుని ఆ తర్వాత కొనేందుకు అవకాశముంటుంది. కానీ తాను అలా చేస్తే తన సినిమాలకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇలాగే డిమాండ్ చేస్తారన్న ఆందోళనతోనో ఏమో.. ఆయన సినిమాలు చూడకుండానే కాంబినేషన్ క్రేజ్ చూసుకుని.. మార్కెట్ లెక్కల్ని అంచనా వేసుకుని భారీ పెట్టుబడులు పెట్టేస్తున్నారు. కానీ ఆయన ఊహించని స్థాయిలో నష్టాలు మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజు మున్ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశముంది. కొంత కాలం పెద్ద సినిమాల జోలికి ఆయన వెళ్లరేమో.