Begin typing your search above and press return to search.
హిందీలో ప్లాప్స్ వచ్చినా దిల్ రాజు నష్టపోలేదా..?
By: Tupaki Desk | 19 July 2022 3:30 AM GMTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో ఒకరైన దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయవంతమైన సినిమాలు అందుకుంటూ తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు దిల్ రాజు.
తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'జెర్సీ' సినిమా హిందీ రీమేక్ ను దిల్ రాజు నిర్మించారు. అల్లు అరవింద్ - నాగవంశీ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఎన్నో అసలు పెట్టుకున్న హిందీ జెర్సీ బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసింది.
అలానే తెలుగులో కమర్షియల్ సక్సెస్ అయిన 'హిట్' చిత్రాన్ని అదే పేరుతో హిందీలో నిర్మించారు దిల్ రాజు. రాజ్ కుమార్ రావ్ - సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది.
ఇలా దిల్ రాజు హిందీలో చేసిన రెండు రీమేక్ సినిమాలు అనుకున్న విధంగా థియేటర్లలో ఆడలేదు. దీంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కు బాలీవుడ్ కలిసిరాలేదని అంతా అనుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల వల్ల తాను నష్టపోలేదని దిల్ రాజు తెలిపారు. నంబర్లతో సహా వివరించారు.
అక్కినేని నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మించిన 'థాంక్యూ' సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నిర్వహించిన మీడియా సమావేశంలో.. హిందీలో నిర్మించిన సినిమాల గురించి మాట్లాడారు.
హిందీ 'హిట్' సినిమాకి మంచి ఓపెనింగ్ రాదని ముందే అనుకున్నామని.. మూవీ బావుందనుకున్నప్పుడు డే బై డే సినిమా బెటర్ అయిందని దిల్ రాజు అన్నారు. ''తొలి రోజు కోటి రూపాయలు వచ్చాయి. రెండోరోజు కోటిన్నర వచ్చింది. మూడో రోజు ఇంకాస్త పెరిగింది. ఎటు చూసినా తొలి మూడు రోజుల్లో రూ.4 కోట్లు వచ్చినట్లే''
''ఇదే 'హిట్' సినిమా పాండమిక్ ముందు రోజుల్లో రిలీజ్ అయి ఉంటే ఫస్ట్ వీకెండ్ లో మినిమమ్ 15 కోట్లు చేసేది. కానీ ఇవాళ నాకు వచ్చే పర్సెంట్ తగ్గింది. మంచి సినిమా తీసినా ఇలా అయితే.. ఇప్పుడు నేను డబుల్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎకానమిక్స్, డైమన్షన్స్ మారిపోయాయి. వాటిని అర్థం చేసుకోవాలి''
''హిందీ 'జెర్సీ' విషయానికొస్తే పాండమిక్ లేకుంటే 30 కోట్లు ప్రాఫిట్ రావాల్సిన సినిమా. వెళ్తున్న కొద్దీ 30 రాదులే.. 15 కోట్లు వస్తుందిలే అనుకున్నాం. ఇంకో స్టేజ్ లో 10 కోట్లు అనుకున్నాం. రిలీజ్ డేట్లు మూడు సార్లు మార్చాం. అప్పుడు లాభం లేకున్నా ఫర్వాలేదు కానీ.. బయటపడితే చాలనుకున్నాం. ఏమాత్రం ఓపెనింగ్ వచ్చినా చాలనుకున్నాం. 3-4 కోట్ల డ్యామేజ్ తో బయటపడ్డాం'' అని దిల్ రాజు తెలిపారు.
దిల్ రాజు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే శాటిలైట్ - డిజిటల్ మరియు ఓటీటీ వల్ల ఈ రెండు సినిమాలను లాభాలతో ముగించారని అర్థం అవుతోంది. కానీ అగ్ర నిర్మాత మాత్రం ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ''ఓటీటీలో సూపర్ హిట్ అయినా నాకు వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ ఎనర్జీ వేరు. ఆడుతున్నకొద్దీ ఎవ్రీ డే కలెక్షన్లు వింటుంటే నిర్మాతలకు ఎనర్జీ ఇస్తుంది'' అని అన్నారు.
''సినిమా ప్యాషన్ గా తీయాలనుకున్నవారికి ఎకానమిక్స్ ముఖ్యమే. ఎనర్జీ కూడా ముఖ్యమే. మైనస్లు తీసేసి, ప్లస్ ల వైపు డ్రైవ్ చేయాలి. నిర్మాతల గురించి హీరోలకు కన్సర్న్ ఉంటుంది. వాళ్లకీ అన్నీ తెలుసు. కాబట్టి వాళ్లందరినీ కూర్చోబెట్టి అడ్రస్ చేయాలి. అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. సమస్యను అర్థమయ్యేలా చెబితే సరిపోతుందని నా ఫీలింగ్'' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.