Begin typing your search above and press return to search.
ఒత్తిడిని జయించే రాజు గారి మంత్రదండం ఇదా?
By: Tupaki Desk | 22 Jun 2022 6:30 AM GMTవరుసగా భారీ చిత్రాల్ని నిర్మిస్తూ.. పంపిణీ చేస్తూ.. జయాపజయాలను రుచి చూస్తూ.. ఇండస్ట్రీ సమస్యలను ఢీకొడుతూ .. పయనం సాగించడం ఎంతటి ఒత్తిడిని పెంచుతుందో ఊహించగలం. అగ్ర నిర్మాత కం పంపిణీదారు దిల్ రాజు ఇటీవల ఇలాంటి ఒత్తిడిలో ఉన్నారన్న గుసగుస వినిపిస్తోంది. అంతేకాదు కొంతకాలం పాటు తన భవిష్యత్ ప్రాజెక్ట్ లన్నింటినీ నిలిపివేసి ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నారని గుసగుసలు స్ప్రెడ్ అయ్యాయి.
పరిశ్రమలోని ప్రస్తుత బంద్ సహా ఇతర పరిస్థితులతో పాటు సినిమా థియేటర్ లకు జనాల హాజరు తక్కువగా ఉండటంతో దిల్ రాజు తన తదుపరి సినిమాలను నిలిపివేయాలని తెలివైన నిర్ణయం తీసుకున్నారంటూ కథనాలొస్తున్నాయి. పరిస్థితులు సద్దుమణిగే వరకు సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు గుసగుస వినిపిస్తోంది.
ప్రస్తుతం శంకర్-రామ్-చరణ్ చిత్రం.. దళపతి విజయ్-వంశీ పైడిపల్లి సినిమా.. రెండూ భారీగా పెట్టుబడులు వెదజల్లేవే. ఈ రెండు సినిమాల్లో భారీ బడ్జెట్ లు పెట్టాలి. బహుభాషల్లో విడుదల చేసి సక్సెస్ అందుకోవాలి. ఇదేమీ అంత ఆషామాషీ కాదు. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లకు రాజు గారు భారీగా నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అందుకే ఇవి గాక ఇతర ప్రాజెక్ట్‌లకు పనిచేయడానికి ఇష్టపడటం లేదట. నాగ చైతన్య తో థాంక్యూ పూర్తయింది. విడుదల కాపీతో రెడీగా ఉన్నారు. ఇకపై ఎలాంటి కొత్త సినిమాలు చేసే వీల్లేదని కూడా గుసగుస వినిపిస్తోంది.
అలాగే దిల్ రాజు ఇటీవల పలు సినిమాల పంపిణీ కారణంగా కొన్ని నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం తన రెండు ప్రధాన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఎంచుకున్నాడు. టాలీవుడ్ కి టిక్కెట్ ధరలు చాలా కీలకం. కరోనా మూడో వేవ్ అనంతరం తెలంగాణలోని అన్ని సినిమాలు రూ. 295 ధర ప్రణాళికతో విడుదల అవుతున్నాయి.
తాను ధరలను పెంచబోనని ఎఫ్3 సమయంలో దిల్ రాజు చెప్పారు. అయితే సినిమా ధరలు పెరగడం లేదని రాష్ట్రంలోని అన్ని మల్టీప్లెక్స్ లలో రూ. 295 టిక్కెట్లు అమ్ముడవుతున్నాయని తేలింది. సాధారణ మల్టీప్లెక్స్ లలో రూ. 250 టిక్కెట్ ధరపై పరిమితి విధించనున్నట్లు దిల్ రాజు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని ఎప్పటికీ నిలబెట్టుకోలేదని టాక్ ఉంది.
మనవళ్లతో విహారయాత్రలు..!
అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఒత్తిడిని జయించేందుకు దిల్ రాజు వద్ద ఒక మంత్రదండం ఉంది. అదే కుటుంబంతో విహార యాత్రలు. దిల్ రాజు ప్రస్తుతం సింగపూర్ లో విహారయాత్రలో ఉన్నారు. తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించి ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్లారు. తన కుమార్తె సహా మనవళ్లతో కలిసి ఈ యాత్రను ఆస్వాధిస్తున్నారు. సింగపూర్ లో ఫాదర్స్ డే జరుపుకుంటున్న చిత్రాలను ఆయన కుమార్తె హన్షితారెడ్డి ఇంతకుముందు షేర్ చేసారు. రాజు గారు ఫ్యామిలీ మ్యాన్. తన కుటుంబం సంతోషం కోసం విలువైన సమయం కేటాయిస్తారు. భార్య అనిత చనిపోయిన అనంతరం కుమార్తె ప్రోద్భలంతో మరో యువతిని ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.