Begin typing your search above and press return to search.
దిల్ రాజు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాడో?
By: Tupaki Desk | 18 Dec 2022 1:30 AM GMTటాలీవుడ్ లో గత కొంత కాలంగా దిల్ రాజు కు సినిమాల్లోనూ, డిస్ట్రిబ్యూషన్ పరంగానూ తిరుగులేదన్నది తెలిసిందే. అయితే తాజాగా ఆయన అన్న మాటలు ఇప్పడు ఆయనకు ఇబ్బంది కరంగా మారబోతున్నాయా అంటే అవుననే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఇంత చిన్న లాజిక్ ని దిల్ రాజు ఎలా మిస్సయ్యాడబ్బా? అనే చర్చ కూడా మొదలైంది. వివరాల్లోకి వెళితే..తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వివాదంగా మారాయి.
విజయ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ అని, అజిత్ కి మించిన క్రేజ్ విజయ్ సొంతమని అజిత్ సినిమాకి మించి విజయ్ సినిమాకు థియేటర్లు కేటాయించాలంటూ అన్న మాటలు ఇప్పడు తమిళనాట సరికొత్త వివాదానికి తెర తీశాయి. తమిళంలో విజయ్ తో నేను నిర్మించిన `వారీసు`తో పాటు అజిత్ హీరోగా నటించిన సినిమా కూడా తమిళనాడులో రిలీజ్ అవుతోంది. అజిత్ తో పోలిస్తే విజయ్ అక్కడ నెంబర్ వన్ స్టార్. అక్కడ మొత్తం 800 థియేటర్స్ వున్నాయని, విజయ్ సినిమాకు 400 థియేటర్స్ మాత్రమే ఇస్తామంటున్నారని తాను మాత్రం మరో 50 కావాలని అడుగుతున్నాను అన్నారు.
అంటే అక్కడ అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ కాబట్టి తాను మరో 50 థియేటర్లు కావాలని అడుగుతున్నానని దిల్ రాజు చెబుతున్నాడు. అంటే ఇక్కడ టాలీవుడ్ లోనూ విజయ్ పెద్ద స్టారే అని చెబుతున్నాడా?.. చిరంజీవి, బాలయ్యలను మించిన స్టార్ విజయ్ అని దిల్ రాజు భావిస్తున్నాడా?.. అక్కడ విజయ్ పెద్ద స్టార్ అయినప్పుడు తెలుగు మార్కెట్ లో చిరు, బాలయ్య పెద్ద స్టార్సే కదా? .. మరి ఈ చిన్న లాజిక్ ని దిల్ రాజు ఎందుకు మిస్సవుతున్నాడు? అని కామెంట్ లు చేస్తున్నారు. ఈ తతంగంపై ఇండస్ట్రీ వర్గాల నుంచే సెటైర్లు పడుతున్నాయట.
కేపబుల్ స్టార్ కు థియేటర్స్ ఎక్కువ దక్కుతాయని లాజిక్‌లు చెబుతున్న దిల్ రాజు మరి అదే ఫార్ములాని ఇక్కడ కూడా వాడాలి కదా? అప్పుడు తెలుగులో పెద్దగా మార్కెట్, క్రేజ్ లేని విజయ్, అజిత్ ల సినిమాలకు తక్కువ థియేటర్లు, తెలుగులో క్రేజ్ వున్న చిరు , బాలయ్యల సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించాలి కతా? అని చిరు, బాలయ్య ఫ్యాన్స్ నెట్టింట రచ్చ మొదలు పెట్టారు.
మరి ఈ లాజిక్ ప్రకారం దిల్ రాజు ఎలా వ్యవహరిస్తాడో.. తెలంగాణలో వున్న 450 స్క్రీన్ లకు ఎన్ని `వారసుడు`కు కేటాయించి ఎన్ని బాలయ్య `వీర సింమారెడ్డి`కి, ఎన్ని థియేటర్లని చిరు `వాల్తేరు వీరయ్య`కు కేటాయిస్తాడో చూడాలని నెట్టింట చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.