Begin typing your search above and press return to search.
వేరేవాళ్ళతో రీమేక్ చేస్తేనే సేఫ్
By: Tupaki Desk | 7 April 2019 4:25 AM GMTఈ ఏడాదిలో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్2 ఊహించని విజయం సొంతం చేసుకుని చాలా చోట్ల ఇండస్ట్రీ రికార్డులు సైతం సెట్ చేసింది. కొన్ని సెంటర్స్ లో త్వరలో శతదినోత్సవం జరుపుకోబోతున్న ఎఫ్2 హిందీలో బోనీ కపూర్ దిల్ రాజుల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అజీజ్ బాజ్మీ దర్శకత్వం వహించబోతున్నాడు. స్టార్ క్యాస్టింగ్ విషయంలో టీమ్ కిందామీదా పడుతున్నట్టు టాక్.
వాస్తవానికి అవే జంటలతో తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ముందు వచ్చిందట. కానీ వెంకీ వరుణ్ తేజ్ లకు నేషనల్ లెవెల్ మార్కెట్ ఏమి లేదు. ఆ లెక్కన బిజినెస్ పరంగా కొన్ని చిక్కులు తప్పవు. తెలుగు హీరోలు రీమేక్ అయినా సరే స్ట్రెయిట్ హిందీ సినిమాలు చేయడం మానేసి చాలా కాలం అయ్యింది. దానికి కారణం ఎన్ని చేసినా అక్కడ సరైన ఇమేజ్ ఏర్పడకపోవడమే. అందుకే ఎఫ్2 విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం
వెంకటేష్ పాతికేళ్ల క్రితం హిందీ యమలీల రీమేక్ లో చివరిసారి బాలీవుడ్ లో నటించాడు. అది డిజాస్టర్ కావడంతో మళ్ళి ఆ ప్రయత్నాలు చేయలేదు. ఏదో డబ్బింగ్ సినిమాల్లో టీవీలో యుట్యూబ్ లో చూడటం తప్ప వరుణ్ తేజ్ ని థియేటర్ లో చూడాలనే ఫాలోయింగ్ నార్త్ లో లేదు. ఈ నేపథ్యంలో ఇదే జంటలతో చేస్తే ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. దాని కన్నా డబ్బింగ్ చేయడం ఉత్తమం. అందుకే హిందీ స్టార్లతోనే ఇది తీస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అజయ్ దేవగన్ వరుణ్ ధావన్ లాంటి కాంబినేషన్ సెట్ చేసుకుంటే మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుంది. సో ఎఫ్2 రీమేక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాలి.