Begin typing your search above and press return to search.
హలో.. ఎంసిఎ.. ఎందుకంటారు?
By: Tupaki Desk | 11 Dec 2017 10:30 PM GMTటాలీవుడ్ లో ఏ ప్లాన్ ఎందుకు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే అందరూ ఒక కంక్లూజన్ కు మాత్రం వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ప్రతీ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ హైదరాబాద్ లోనే జరిగేవి. అయితే ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్ లన్నీ భాగ్యనగరంలో కాకుండా ఇతర చోట్ల చేయాలని చూస్తున్నారు సినీ ప్రముఖులు. ఇంతకీ అందుకు కారణం ఏంటంటారు?
ఇప్పుడు దిల్ రాజు కొత్త సినిమా ఎంసిఏ ప్రి-రిలీజ్ ఈవెంటును వరంగల్ లో నిర్వహిస్తున్నారు. అదేమంటే.. సినిమా అంతా వరంగల్ బ్యాక్ డ్రాపులోనే ఉంటుంది కాబట్టి.. ఫంక్షన్ అక్కడే పెట్టాం అంటున్నారు. ఆల్రెడీ మొన్న హలో సినిమా తాలూకు ఆడియో ఈవెంటును వైజాగ్ లో పెట్టేశారు. అదేమంటే.. టాలీవుడ్ ను హైదరాబాద్ నుండి వైజాగ్ తీసుకురావడానికి ఇదే తొలి మెట్టు అంటూ అక్కడకు వచ్చిన వక్తలు చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు దిల్ రాజు వరంగల్ లో ప్రోగ్రాం చేస్తున్నారంటే.. టాలీవుడ్ ను వరంగల్ తీసుకెళ్ళాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లా?
నిజానికి మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చిన టాలీవుడ్ కథే వేరు. తమిళం నుండి కట్టలు తెంచుకుని మన ఇండస్ర్టీ ఇక్కడకు వచ్చేసింది. కాని ఇప్పుడు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళినా వరంగల్ వెళ్ళినా ఇండస్ర్టీకి జరిగే లాభం ఏమీ ఉండదు. మహా అయితే అక్కడ స్టూడియోలు ల్యాబులూ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ప్రొడక్షన్ డిజైన్ సంస్థలు కొత్తవి పుట్టుకొచ్చి వారికి లాభం వస్తుందేమో కాని.. టాలీవుడ్ ప్రస్తుతం ఎక్కడున్నా ఒక్కటే. అందుకే చాలామంది సినిమా పెద్దలు ఇక్కడే తిష్ట వేశారు. కాదంటారా?