Begin typing your search above and press return to search.
కృష్ణవంశీతో దిల్ రాజు
By: Tupaki Desk | 28 Jun 2015 12:30 PM GMTవరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ.. 'గోవిందుడు అందరివాడేలే'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్టేమీ కాదు కానీ.. కృష్ణవంశీ గత సినిమాలతో పోలిస్తే బెటర్. రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేశాక కృష్ణవంశీని అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మళ్లీ ఇప్పుడు తనదైన శైలిలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కృష్ణవంశీ. యువ కథానాయకుడు సందీప్ కిషన్‌తో ఓ చిన్న సినిమా చేయడానికి మంచి కథ ఒకటి రెడీ చేశాడు కృష్ణవంశీ.
హీరో అయితే కన్ఫమ్ అయ్యాడు కానీ.. ప్రొడ్యూసర్‌ను సెట్ చేసుకోవడానికి మాత్రం కృష్ణవంశీకి కొంచెం టైం పట్టింది. చాలామందిని ట్రై చేశాక చివరికి దిల్ రాజు ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడట. రాజు కూడా ఇంతకుముందు వరుసగా స్టార్స్‌తో సినిమాలు చేశాడు. కానీ వాటి వల్ల పెద్దగా మిగిలేదేమీ లేకపోవడంతో మళ్లీ ఇప్పుడు చిన్న సినిమాల మీద దృష్టిపెట్టాడు. ఇటీవలే 'కేరింత'తో విజయాన్నందుకున్న రాజు.. మరిన్ని చిన్న సినిమాలు తీయాలన్న ప్లాన్‌లో ఉన్నాడు. కృష్ణవంశీ కథ బాగా నచ్చడంతో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాడు. సందీప్ 'టైగర్'తో విజయాన్నందుకోవడం.. దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ నిర్మాణానికి ముందుకు రావడంతో కృష్ణవంశీ సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేసింది.