Begin typing your search above and press return to search.
తారక్ నో.. నితిన్ ఒకే
By: Tupaki Desk | 14 Nov 2017 8:17 AM GMTశతమానం భవతి సినిమాతో మంచి హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న మారో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా నితిన్ కు చెప్పిన కథ ఒకే అవ్వడంతో త్వరలోనే దిల్ రాజు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. లై సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ని అందుకున్న నితిన్ కు నెక్స్ట్ ఏ సినిమా తీయాలనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే సతీష్ కథ నచ్చడంతో నెక్స్ట్ ఇదే సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఈ కథపై ఒక కొత్త ఊహాగానం కూడా తెరపైకి వచ్చింది, గతంలో ఎన్టీఆర్ తో దిల్ రాజుతో ఇక సినిమాను చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న రెండు మూడు సార్లు కథను కూడా వినిపించాడు. కానీ తారక్ మాత్రం కథలో కొన్ని నచ్చలేదని చెప్పడంతో ఆ సినిమా ఇప్పుడు నితిన్ కి షిఫ్ట్ చేశారు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ తరహా డైవర్షన్ లు దిల్ రాజుకు చాలా కామన్. ఇంతకుముందు అయన హిట్టు కథలు చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లాయని దిల్ రాజే చాలా సార్లు చెప్పాడు.
అయితే మొత్తానికి ఇప్పుడు నితిన్ ఒకే చేసిన కథ తారక్ నో చెప్పాడని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక సినిమాను దిల్ రాజు మరి కొన్ని రోజుల్లో అధికారికంగా స్టార్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలియజేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక నితిన్ గరుడవేగ దర్శకుడితో సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం గురించి తెలిసిందే.