Begin typing your search above and press return to search.
శర్వాతో దిల్ రాజు ఆశీర్వాదం
By: Tupaki Desk | 18 May 2016 11:30 AM GMTశతమానం భవతి.. పండితులు ఇచ్చే ఆశీర్వచనాల్లో ఇదొకటి. ఈ టైటిల్ పై సినిమా చేస్తానని అప్పుడెప్పుడో చెప్పాడు దిల్ రాజు. సతీష్ వేగ్నేశను దర్శకుడిగా పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు కూడా. కానీ ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.
మొదట మెగా హీరో సాయిధరం తేజ్ తో శతమానం భవతి తీయాలని భావించిన దిల్ రాజు.. సుప్రీమ్ హీరో కాంట్రాక్ట్ కొనసాగించేందుకు సిద్ధపడకపోవడంతో వేరే హీరోని వెతుక్కున్నాడు. కుర్ర హీరో రాజ్ తరుణ్ హ్యాట్రిక్ హిట్స్ తో ఊపుమీదున్న సమయంలో శతమానం భవతి అతడి దగ్గరకు కూడా వెళ్లింది. ఫైనల్ అనుకున్న సమయంలో.. రాజ్ తరుణ్ కూడా దీన్నుంచి తప్పుకున్నాడు. తర్వాత నేచురల్ స్టార్ నానితో ఈ సినిమా చేసే అవకాశాలున్నాయనే వార్తలొచ్చాయి కానీ.. అది కూడా పట్టాలెక్కలేదు. ఇప్పుడు శతమానం భవతికి ఎట్టకేలకు హీరో దొరికాడు.
యంగ్ హీరో శర్వానంద్ తో ఈ చిత్రాన్ని తీసేందుకు డీల్ ఫైనల్ అయింది. శర్వా కూడా ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా తెరకెక్కే ఈ మూవీతో సతీష్ వేగ్నేశ దర్శకుడిగా పరిచయం కానుండగా.. కొత్త గెటప్ తో ఈ హీరో దర్శనమిస్తాడని తెలుస్తోంది. ప్రాజెక్టుతో పాటు ఇతర కాస్టింగ్, టెక్నీషియన్స్ డీటైల్స్ ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. మొత్తానికి ముగ్గురు హీరోలను దాటి శర్వాత చేతికి చేరింది శతమానం భవతి.